ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్యాబోధన


Sun,June 16, 2019 12:17 AM

-కొట్యాలలో బడిబాట కార్యక్రమం
-పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీరఘోత్తంరెడ్డి, డీఈవో రవికాంతారావు
-పాఠశాలల్లో వసతుల కల్పనకుప్రజాప్రతినిధుల సహకారం
ములుగు : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన, ఉత్తమ విద్యాబోధననందిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జిల్లా విద్యాధికారి రవికాంతారావు అన్నారు. మండల పరిధిలోని కొట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ గంగిశెట్టి గణేశ్‌గుప్తా, ప్రధానోపాధ్యాయుడు దాస్యం రాంబాబు ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, డీఈవో రవికాంతారావు హాజరై విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదివి ఉన్నత స్థానాలను అధిరోహించినపుడే తమ కుటుంబాలతోపాటు గ్రా మాలు అభివృద్ధి చెందుతాయ న్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ప్రైవేట్‌ విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, తల్లిదండ్రులు ఇప్పటికైనా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ నైపుణ్యాలు కలిగిన ఉ పాధ్యాయులుంటారని చెప్పా రు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించడంతోపాటు ఎంతోమంది మెరిట్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారని తెలిపారు.
కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, ఎంఈవో ఉదయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో కౌసల్యాదేవి, ఎమ్మార్వో విజయ్‌కుమార్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఆగంరెడ్డి, ఎంఐఎస్‌ వెంకటేశం, సీఆర్పీ కవిత, టీఆర్‌ఎస్‌ నేతలు నర్సంపల్లి అర్జున్‌గౌడ్‌, పెద్దబాల్‌ అంజన్‌గౌడ్‌, సర్పంచ్‌లు బంగ్ల గణేశ్‌, బొల్లెపల్లి బాలకృష్ణ, ఉపసర్పంచ్‌ కృష్ణ పాల్గొన్నారు.
వసతుల కల్పనకు దాతల సహకారం...
బడిబాటలో కొట్యాల గ్రామ సర్పంచ్‌ గంగిశెట్టి గణేశ్‌గుప్త్తా మాట్లాడుతూ పాఠశాలలో ఇంగ్లిష్‌ బోధించడానికి అవసరమ్యే విద్యావలంటీర్లను నియమించి, వారి వేతనాలను చెల్లించడంతోపాటు విద్యార్థులకు అవసరమ్యే పుస్తకాలు, యూనిఫామ్స్‌, ఇతర సామగ్రిని తాను సొంతంగా ఇస్తానని తెలిపారు. జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మఅర్జున్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు ప్రొజెక్టర్‌ ఇస్తానని తెలిపారు. ఎంపీపీ పెద్దబాల్‌ లావణ్యఅంజన్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పాఠశాలకు నీటిశుద్ధ్ది యంత్రాలను ఇస్తానని తెలిపారు. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పీఆర్టీయూ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదివే విద్యార్ధుల కోసం పాఠశాలకు కంప్యూటర్‌ను విరాళంగా ఇస్తానని తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...