అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు పౌష్టికాహారం


Sat,June 15, 2019 12:09 AM

దుబ్బాక,నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాలలోనే చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రాథమిక విద్యావకాశాలను కల్పించటం జరిగిందని స్త్రీశిశు సంక్షేమశాఖ(ఐసీడీఎస్‌) జిల్లా అధికారి జరీనాబేగం తెలిపారు. బడిబాటలో భాగంగా శుక్రవారం దుబ్బాక ఐసీడీఎస్‌ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా అధికారి జరీనాబేగం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఐసీడీఎస్‌ సేవలను విస్తృత పరిచేందుకు అంగన్‌వాడీలు కృషి చేయాలన్నారు. పట్టణ, గ్రామాలలో చిన్నారుల సంరక్షణతో పాటు బాల్య వివాహాలను అరికట్టేందుకు అంగన్‌వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గర్భిణులతో పాటు పుట్టిన బిడ్డ నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. 3-5 సంవత్సరాల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం అందుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో దుబ్బాక సీడీపీవో సంధ్యారాణి, సరిత, సూపర్‌వైజర్‌ శ్రీలక్ష్మి, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌ మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...