సర్కారు బడికి పోదాం..


Sat,June 15, 2019 12:08 AM

-జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన బడిబాట
-ర్యాలీలు, కరపత్రాలు పంపిణీ
-కొండపాకలో బడిబాటను ప్రారంభించిన డీఈవో
సిద్దిపేట టౌన్‌ : బడీడు పిల్లలందరినీ బడిలో చే ర్పించాలనే బృహత్తర కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అనే నినాదంతో బడిబాట కార్యక్రమా న్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ నెల 14 నుం చి 19 వరకు జరిగే బడిబాట జరుగనున్నది. ఆరు రోజుల పాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధు లు, పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆయా పా ఠశాలల పరిధిలోని బడీడు పిల్లలను బడిలో చే ర్పించేందుకు బడిబాట పట్టారు. ఒక్కో రోజు ఒ క్కో విధంగా ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని చేపడుతారు. మొదటి రోజు ఆవాస ప్రాంతాల్లో బడీ డు పిల్లలను గుర్తించి బడిలో చేర్పిస్తారు. పాఠశాలలను మామిడి తోరణాలతో ఆకర్షణీయంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. కరపత్రాలు ము ద్రించి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ, వాటిని పంపిణీ చేశారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలల్లో సౌకర్యాలు, వసతులపై వారికి అవగాహన కల్పించారు. కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలను తలదన్నే లా ప్రభుత్వ పాఠశాలలు శతశాతం ఫలితాలు రాబడుతున్నాయని తల్లిదండ్రులకు బోధించారు. ఆగట్టునెమో మోతమోయలేని ఫీజులున్నాయి.. ఈగట్టున ఉచిత విద్యతో పాటు నాణ్యమైన సౌకర్యాలున్నాయంటూ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవే టు పాఠశాలలకు బేధాలను చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా చైతన్యం కల్పించారు. ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నూటికి నూరు శాతం ఫలితాలు రాబడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా రాణిస్తున్నాయని వివరించారు.

మొదటి రోజు బడిబాటకు మంచి స్పందన
విద్యాశాఖ చేపట్టిన బడిబాటకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యతో పాటు నాణ్యమైన భోజనం, కంప్యూటర్‌ ల్యాబ్‌, డ్యూయల్‌ డెస్క్‌ లు, విశాలమైన తరగతి గదులు, అన్ని సౌకర్యాలతో విద్యను బోధిస్తున్నామని ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు, డిజిటల్‌ తరగతుల్లో బోధన జరుగుతుందని వివరించారు. పాఠశాలల ప్రత్యేకతలను కరపత్రంలో ముద్రించి ఇంటింటికీ పంచారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులతో సామూహిక అక్షరభ్యాసాలను ఉపాధ్యాయులు చేయించారు. బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించారు.

బడిబాటను ప్రారంభించిన డీఈవో
జిల్లాలో ఆరు రోజుల పాటు జరిగే బడిబాటను జిల్లా విద్యాధికారి రవికాంత్‌రావు ప్రారంభించారు. కొండపాక మండలం మోడల్‌ స్కూల్లో, ఘణపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో బడిబాట కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల హెచ్‌ఎం, ప్రజాప్రతినిధులు బడిబాటకు శ్రీకారం చుట్టారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...