మంచుకొండల్లో 9వ సారి అన్నదానం


Fri,June 14, 2019 12:28 AM

సిద్దిపేట టౌన్ : పరమ శివుడి అనుగ్రహంతో 9వ సారి మంచుకొండల్లో అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ అన్నారు. ఈ నెల 15న అమర్‌నాథ్‌కు ఆహార సామగ్రి లారీకి పూజ చేయడాన్ని పురస్కరించుకొని అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ప్రతినిధులు రామరాజు రావిచెట్టు హనుమాన్ ట్రస్టు భవనంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు మధుసూదన్ మా ట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే అమర్‌నాథ్ యాత్ర లో తెలుగువారి వంటకాలు అందించేందుకు సన్నద్ధమయ్యామన్నారు. అందులో భాగంగానే ఈ నెల 15న శరభేశ్వర ఆలయం వద్ద నుంచి ఆహార సామగ్రి లారీకి పూ జలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వస్తున్నారన్నారు.

అమర్‌నాథ్‌లోని బాల్తాల్ పంచతర్ణి వద్ద రెండు లంగర్లలో తెలుగు యాత్రికులకు వంటకాలను అందిస్తున్నట్లు తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ ఏడాది లుథియా, అమృత్‌సర్ మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు అమర్‌నాథ్ యాత్ర ఉంటుందని చెప్పారు. యాత్ర పూర్తయ్యేవరకు తెలుగువారికి అన్నదానం చేస్తు న్న ఏకైక లంగర్ మనదని చెప్పారు. అందరి సహకారం తో మంచుకొండల్లో అన్నదానం చేస్తున్నామని, వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి కాచం కాశీనాథ్, కోశాధికారి గోపిశెట్టి శరభయ్య, ఉపాధ్యక్షుడు అయిత రత్నాకర్, జిల్లా శ్రీనివాస్, బుచ్చయ్య, చంద్రమౌళి, నవీన్‌కుమార్, రాజమౌళి, అశోక్, ఈశ్వర్ చరణ్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...