బాలవికాస సంస్థ సేవలు అభినందనీయం


Fri,June 14, 2019 12:28 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నా బాల వికాస సంస్థ సేవలు అభినందనీయమని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్చంద సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పేదలకు అండగా నిలిచి సేవలందిస్తేనే శాశ్వతంగా గుర్తుంటాయని తెలిపారు. బాలవికాస సంస్థ చేపడుతున్నా సేవ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో ప్రజలకు శుద్ది నీటిని అందించటంతో పాటు చెరువు, కుంటల తవ్వకాలు చేపట్టడం ఆదర్శంగా నిలిచాయన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారిని తరమికొట్టేందుకు ప్రభుత్వంతో పాటు బాల వికాస చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. గ్రామీణులు ప్రభుత్వ పథకాలతో పాటు స్వచ్చంధ సంస్థల సేవాలను సద్వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధి కోసం యువత ముందుండాలని ఆయన సూచించారు. గ్రామంలో బాల వికాస నీటిశుద్ది ప్లాంట్‌ను ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. అనంతరం ఏటీడబ్ల్యూ (ఎనీటైం వాటర్) కార్డులను గ్రామస్తులకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజయ్య, ఎంపీటీసీ కనకయ్య, బాలవికాస ప్రతినిధులు తదితరులున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...