భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత


Thu,June 13, 2019 12:09 AM

-జిల్లాలో సాగుతున్న నకిలీ దందా
-అరికట్టేందుకు అధికారుల చర్యలు
-చాపకింద నీరులా విస్తరిస్తున్న దందా
-ములుగు, వర్గల్ మండలాల్లో విజిలెన్స్ అధికారుల దాడులు
-రూ. 34లక్షల విలువ చేసే విత్తనాలు స్వాధీనం
-పోలీసుల అదుపులో ఏడుగురు
ములుగు : ఆరుగాలం కష్టించి పంట పండించే రైతన్నను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలను సరఫరా చేసే ముఠాలు వెలిశాయి. ఆస్తులు కుదవపెట్టి వ్యవసా యం చేసే రైతన్నలు.. మంచేదో? చెడేదో? తెలియక నకిలీ విత్తనాలను కొని అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలతో మంది రైతులు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా ఇటీవల పెరిగింది. తాజాగా ములుగు, వర్గల్ మండలాల్లో విజిలెన్స్, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.
బుధవారం ములుగు, వర్గల్ మండలాల్లో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ ఆదేశాలతో విజిలెన్స్ సీఐలు వినాయక్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డిలు స్థానిక వ్యవ సాయ అధికారులతో కలిసి చేపట్టిన దాడుల్లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. గతంలో బైండోవర్ అయిన 15 మందికి హెచ్చరికలు జారీ చేసినా మార్పురాలేదు.
విషయాన్ని గమనించిన అధికారులు 15 రోజులుగా వారిపై ప్రత్యేక నిఘా వేసి బుధవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు కేంద్రంగా నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన షేక్‌ఖాదర్‌వలీ అనే వ్యక్తితోపాటు అంబర్‌పేటకు చెందిన కృష్ణ, గిర్మాపూర్‌కు చెందిన మహేశ్, దండుపల్లికి చెందిన రవీందర్, చందాపూర్‌కు చెందిన శౌరీ, శాఖారం గ్రామానికి చెందిన కృష్ణలు గుంటూరు జిల్లా దామరపల్లి గ్రా మానికి చెందిన ఆలపాటి శ్రీనివాసరావుతో నకలీ విత్తనాలను విక్రయించే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీకి చెందిన శ్రీనివాసరావు.. నకిలీ విత్తనాలను గుట్టు చప్పు డు కాకుండా జిల్లాలోని తన వ్యక్తులకు సరఫరా చేస్తున్నాడు. అధిక దిగుబడులు ఇవ్వడంతోపాటు వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుందని రైతులను నమ్మిస్తూ.. ఆరుగురు వ్యక్తులు నకిలీ విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలను గోకులకృష్ణ, పల్లవి అనే పేర్లతో పత్తి విత్తనాల ప్యాకెట్లుగా చేసి ఒక్కో కవర్‌లో 450గ్రాముల నకిలీ పత్తి విత్తనాలను ప్యాక్‌చేసి రైతులకు విక్రయిస్తున్నారు.

వీటితోపాటు 1365 కిలోల విత్తనాలను బుధవారం జరిగిన దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.34 లక్షల వరకు ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్ తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారనే అనుమానంతో జిల్లావ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వర్గల్ మండలంలో మాదాపూర్, శాఖారం గ్రామాలను కేంద్రంగా విక్రయిస్తున్నారనే అనుమానం తో విజిలెన్స్ అధికారులు నిఘా వేశారు. విజిలెన్స్ ఎస్పీ మనోహర్ ఆధ్వర్యంలో సీఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు దాడులు నిర్వహించారు. వర్గల్ మండ లం శాఖారం, మాదాపూర్, గిర్మాపూర్, చందాపూర్, ములుగు మండలం శ్రీరాంపూర్, నర్సాపూర్ గ్రామాల్లో నిల్వ ఉంచిన 1365 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకుని ఏడుగురు వ్యక్తులను పోలీసులకు అప్పగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. కార్యక్రమంలో ములుగు ఏడీఏ అశోక్‌కుమార్, ఏవో ప్రగతి, పోలీసులు సంజీవరెడ్డి, శివానంద్, విజయ్, చరణ్, ఏఈవోలు మల్లేశ్, పృథ్వీ తదితరులు ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...