అభివృద్ధి, సంక్షేమమే సర్కారు లక్ష్యం


Thu,June 13, 2019 12:08 AM

దుబ్బాక టౌన్: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 117 మంది లబ్ధిదారులకు రూ.1,14,87,528ల కల్యాణలక్ష్మీ చెక్కులతో పాటు ఎమ్మెల్యే సొంత డబ్బులతో కొనుగోలు చేసిన చీరను ఒక్కో లబ్ధిదారులకు అందజేశారు. అలాగే, 126 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోలిపేట మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరినప్పుడే నిజమైన సేవ చేసినట్లు గుర్తింపు వస్తుందన్నారు. కొన్ని కుటుంబాలు పూట గడవడం కూడా కష్టతరంగా ఉండడంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరికి మిషన్‌భగీరథ నీరందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటి తరహాలోనే సాగునీటిని కాల్వల ద్వారా తరలించి చెరువులను నింపే కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నదన్నారు. తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారి అన్ని కుటుంబాలు పాడిపంటలతో సల్లంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిత్యం తపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్‌రెడ్డి, ఎంపీపీ ర్యాకం పద్మాశ్రీరాములు, తహసీల్దార్ అన్వర్, పీఏసీఎస్ చైర్మన్ అమ్మన రవీందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వంగ బాల్‌రెడ్డి, ఎంపీటీసీలు కోమటిరెడ్డి మమత, కనకయ్య, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
దుబ్బాకలో పాత పశువుల దవాఖాన స్థలంలో నూతనంగా ఎస్‌డీఎఫ్ నిధులు రూ. 60 లక్షలతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులకు బుధవారం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే, పోచమ్మ గుడి వద్ద నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆనుకొని టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.15 లక్షలతో షీ టాయిలెట్స్ పనులను ప్రారంభించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...