విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలి


Thu,June 13, 2019 12:07 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో విద్య, వృత్తి, జీవన నైపుణ్యాల ప్రమణాలు పెంపొందించేందుకు వ్యక్తిగతంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని విద్యాశాఖ జిల్లా సెక్టోరియిల్ అధికారి డా.టి.రమేశ్ సూచించారు. సెక్టోరియిల్ అధికారి రమేశ్.. స్థానిక ఎంఈవో రాములుతో కలిసి బుధవారం మండలంలోని గుర్జకుంట పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పిల్లల ప్రగతి నమోదు కార్డ్సులో విద్యార్థుల పరీక్షల ఫలితాలు నమోదు చేసి, తల్లిదండ్రుల సంతకాలు తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు సర్కారు బడిలో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సెక్టోరియల్ అధికారి రమేశ్ సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
మద్దూరు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు ఉపాధ్యాయులు కూడా సహకరించాలని విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. మద్దూరు మండలకేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మెరుగైన వసతులను సమకూర్చుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని వివరిం చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 65 మంది విద్యార్థులను చేర్పించిన గ్రామ సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డిని విద్యాశాఖ అధికారులు అభినందించారు. కార్యక్రమంలో డీఎస్‌వో మహేందర్, ఎంఈవో నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ ఆరీఫ్, హెచ్‌ఎం చక్రపాణి, ఉపాధ్యాయులు మజర్‌అలీ, ఫరహత్ సుల్తానా, నాయకులు దామెర మల్లేశం, బూర్గు రాజు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...