సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు


Tue,June 11, 2019 11:31 PM

-రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- పెట్టుబడి సాయం పెంచడం హర్షనీయం
-జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంట పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పెంచడం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయాన్ని పెంచినందుకు గాను ఆయన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేసి రైతుకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది రైతుల ఖాతాలో రైతుబంధు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేశారన్నారు. రైతుల సమగ్ర అభివృద్ధి కోసం విత్తనాల సబ్సిడీతో పాటు ఎరువులను రైతన్నలకు సకాలంలో ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతాంగానికి సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు కృషి చేస్తున్నారన్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కావడం వల్లే నేడు రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని నాగిరెడ్డి తెలిపారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...