ధర్మగంట మోగించనున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి


Tue,June 11, 2019 11:31 PM

-ఈ నెల 13న రెవెన్యూ సమీక్షలు
-నమస్తే తెలంగాణ స్ఫూర్తితోనిర్వహణ
-రైతులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు
-ధర్మగంటను ఆశ్రయించిన బాధితులు, పెండింగ్ పట్టాదారు పాస్‌పుస్తకాలపై ప్రత్యేక సమావేశం
చేర్యాల, నమస్తే తెలంగాణ : నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభించిన ధర్మగంటను స్ఫూర్తిగా తీసుకొని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ధర్మగంటను ఆశ్రయించిన బాధితులు, రైతులు, ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు అందని రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నడుం బిగించారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 9 నుంచి 11గంటల వరకు కొమురవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో, అదే రోజు మధ్యాహ్నం 12నుంచి 2గంటల వరకు చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో, అలాగే, 3నుంచి 5గంటల వరకు మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల రెవెన్యూ సమస్యలు, పెండింగ్ పాసుపుస్తకాలు, ధర్మగంటను ఆశ్రయించిన బాధితుల సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించనున్నారు. మూడు మండలాల్లో రైతుబంధు, పెండింగ్ పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, ఇతర అధికారులు, సిబ్బందితో బాధిత రైతులులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నమస్తే తెలంగాణకు తెలిపారు. అలాగే సమీక్ష సమావేశానికి ధర్మగంటను ఆశ్రయించిన రైతులు, యజమానులు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...