వానకాలానికి..వడివడిగా..


Mon,June 10, 2019 11:44 PM

-వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతాంగం
-సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన యంత్రాంగం
-ఎకరానికి రూ. 5వేలు జమ చేస్తున్న ప్రభుత్వం
-సాగు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు
సిద్దిపేట ప్రతినిధి/దుబ్బాక, నమస్తే తెలంగాణ:ఆశాజనకంగా తొలకరి పలుకరించగా, జిల్లా రైతాంగం వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నది. గతేడాది వర్షాలు అంతంతే ఉండగా, ఈయేడు వర్షాలు బాగా పడి చెరువులు, కుంటలు నిండుతాయన్న గంపెడు ఆశతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేస్తున్నది. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఆదివారం వరకు జిల్లాలోని 70,275 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా, నాలుగైదు రోజుల్లో మిగతా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుందని వ్యవసాయ శాఖ పేర్కొన్నది. అలాగే, పంటలు వేసేందుకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులను ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. రూ.లక్ష రుణమాఫీకి సర్కారు మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. త్వరలోనే రైతుల రుణమాఫీని నాలుగు విడుతల్లో చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

జిల్లాలో తొలకరి పలుకరించగా, వానకాల పంటల సాగుకు రైతాంగం సిద్ధమైంది. ఒకవైపు దుక్కులు దున్నుతూ, మరో వైపు ఎరువులు, విత్తనాలు తెచ్చే పనిలో నిమగ్నమైంది. గతేడాది వర్షాలు అంతంతే ఉండగా, ఈయేడు వర్షాలు బాగా పడి చెరువులు, కుంటలు నిండుతాయన్న గంపెడు ఆశతో సాగుకు సమయాత్తమవుతున్నది. అన్ని మండల కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఇప్పటికే రైతుల ఖాతాలో జమ చేసింది. ఆదివారం వరకు జిల్లాలోని 70,275 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కాగా, నాలుగైదు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రూ.లక్ష రుణమాఫీకి సర్కారు మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. త్వరలోనే రైతుల రుణమాఫీని నాలుగు విడుతల్లో చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

ఈ యేడు సకాలంలో తొలకరి పలుకరించడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకంతో వానకాలం సాగుకు సిద్ధమయ్యారు. కోటి ఆశలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురువడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వానకాలం సాగు అంచనాలను వ్యవసాయాధికారులు రూపొందించారు. పత్తిపంట సాధారణ సాగు 1,68,325 ఎకరాలు కాగా, ఈ సారి 1,96,671 సాగు కానున్నట్లు అంచనా వేశారు. వరి సాధారణ సాగు 78,113 ఎకరాలకు గానూ ఈ సారి 83,329 ఎకరాలు, మొక్కజొన్న 78,113 ఎకరాల సాధారణ సాగు కాగా, అంచనా 82,329 ఎకరాలు, కందులు 21,705 ఎకరాల సాధారణ సాగు కాగా, 24,274 ఎకరాల్లో, పెసర 1,786 ఎకరాల సాధారణ సాగు కాగా, 1,414 ఎకరాల్లో, సోయాబీన్ 435 ఎకరాల సాధారణ సాగు కాగా, 123 ఎకరాలు, జొన్న 136 ఎకరాల సాధారణ సాగు కాగా, 306 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు అనుగణంగా ఆయా మండల కేంద్రాల్లో సిద్ధంగా విత్తనాలను ఎరువులను ఉంచి రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారు. ప్రధానంగా మొక్కజొన్నకు కిలోకు రూ. 35 సబ్సిడీని అందిస్తున్నారు. వరి 7,500 క్వింటాళ్లు, మొక్కజొన్న 6,000 క్వింటాళ్లు, జొన్న 10 క్వింటాళ్లు, కందులు 480 క్వింటాళ్లు, పెసర్లు 40 క్వింటాళ్లు, సోయాబీన్ 50 క్వింటాళ్లు, పత్తి 4,91,696 ప్యాకెట్లు, వీటితో పాటు 1,500 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఎరువులు 36,780 మెట్రిక్ టన్నుల యూరియా, 26,086 మెట్రిక్ టన్నుల డీఏపీ, 7,519 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 29,846 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 10,574 మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ మొత్తం 1,10,805 మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచి, రైతాంగానికి అందిస్తున్నారు.

జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటలు
వానకాలంలో రైతులు వివిధ పంటలు సాగుకు సంబంధించి రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిచాల్సి ఉంది. ముఖ్యంగా జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, పెసర, నువ్వులు, సోయా చిక్కుడు తదితర పంటలను వేస్తుంటారు. ఈ పంటలను వేయడానికి రైతులు మెలకువలను పాటించాల్సిన అవసరముందని వ్యవసాయాధికారులు. ముఖ్యంగా ప్రతి రైతు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలి. ఇలా చేయడం మూలంగా అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

ఆగ్రోస్ కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు
రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం రైతుసేవా కేంద్రాలను(ఆగ్రోస్) ఏర్పాటు చేసింది. ఆగ్రోస్‌లో సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేసేందుకు ముందుగా వ్యవసాయ కార్యాలయంలో రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలను చూపించి పర్మిట్ తీసుకోవాలి. పర్మిట్ తీసుకున్నవారికి మాత్రమే ఆగ్రోస్‌లో సబ్సిడీ విత్తనాలు అందిస్తారు. కంది రకాల విత్తనాలకు 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. వీటితో పాటు సిరి ధాన్యాలైన జొన్నుల, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు.


విత్తన రసీదు భద్రపర్చుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 70వేల మంది రైతుల ఖాతాలో నగదు జమ అయ్యింది. త్వరలోనే రైతులందరి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అన్ని మండల కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో పెట్టాం. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులను రైతులు భద్రపర్చుకోవాలి. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు కొనుగోలు చేయాలి. గ్రామాల్లో ఎవరైన నకీలి విత్తనాలు అమ్ముతున్నట్లు అనుమానమొస్తే, వెంటనే స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు సమాచారమివ్వాలి. వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్న రైతులు, విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు వస్తాయి. రైతులు తొందరపడి తొలకరి వర్షాలకు విత్తనాలు వేయవద్దు.

శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి
సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలి
సబ్సిడీ విత్తనాలను రైతులు వినియోగించుకోవాలి. ప్రైవేటు దుకాణాల్లో అత్యాధిక ధరలు చెల్లించి నష్టపోవద్దు. ఆగ్రోస్ కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతులు తమ పాసుపుస్తకాలు తెచ్చి, సబ్సిడీ విత్తనాల పర్మిట్లు తీసుకోవాలి. దుకాణాల్లో వ్యాపారులు బలవంతంగా రైతులకు విత్తనాలు అంటకట్టవద్దు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.
- ప్రవీణ్, ఏవో, దుబ్బాక

ఆగ్రోస్‌లో సబ్సిడీ విత్తనాలు.. వాటి ధరలు..
క్ర.సం విత్తన రకం బరువు/కిలోలు పూర్తి ధర సబ్సిడీ రైతు
చెల్లించాల్సిన ధర
1. వరి ఎంటీయూ1010 30కిలోలు రూ. 870 రూ.150 రూ. 720
2. వరి కేఎన్‌ఎం 118 30 కిలోలు రూ.870 రూ.300 రూ. 570
3. వరి బీపీటీ 25 కిలోలు రూ.760 రూ.125 రూ. 635
4. వరి తెలంగాణ సోనా 25 కిలోలు రూ.660 రూ.150 రూ.510

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...