పలు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ


Mon,June 10, 2019 11:40 PM

సిద్దిపేట అర్బన్ : పలు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థులకు సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్ 1, 2,3,4, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా ఐదున్నర నెలల పాటు ఫౌండేషన్ కోర్సు ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నామని టీఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూ ర్తి చేసిన వారు అర్హులన్నారు. ఈ నెల 20 వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఆదాయం సంవత్సరానికి రూ. 3 లక్షలు మించరాదన్నారు. ఈ ఉచిత శిక్షణ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 30న ఎంట్రెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎం ట్రెన్స్ ద్వారా ఎంపిక చేయబడిన 100 మంది అభ్యర్థులకు జూలై 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఐదున్నర నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే రూ. 2,500 విలువగలిగిన స్టడీ మెటీరియల్‌ను అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను www.tsscstudycircle.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9182220112, 9553167760 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...