సత్పవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి


Sat,May 25, 2019 11:43 PM

దుబ్బాక టౌన్ : ఖైదీల్లో సత్పవర్తనను తీసువచ్చేందుకు జైళ్లలోనే ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని సంగారెడ్డి జైలర్ గణేశ్‌బాబు, సిద్దిపేట జైలర్ ప్రకాశ్‌లు అన్నారు. శనివారం దుబ్బాకలో ఖైదీలు తయారు చేసిన 134 రకాల ఉత్పత్తులను పలు దుకాణాల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైళ్లలోకి వచ్చే ఖైదీలకు యుద్ధ ప్రాతిపదికన వారిలో మార్పు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేరస్తుల్లో తీసుకువస్తూ జైళ్లలోనే ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. తమ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశానుసారం సత్పవర్తన కలిగిన ఖైదీలకు పలు రకాల వస్తువులను తయారు చేయడం, పెట్రోల్ పంపుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇదంతా రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని గణేశ్‌బాబు, ప్రకాశ్ తెలిపారు. ఖైదీలు తయారు చేసిన ప్రొడక్ట్‌ను సమాజంలో పరిచయం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రతి మండలంలో 4 దుకాణాలు గుర్తించి వాటి ద్వారా విక్రయాలు జరుపుతామన్నారు. వాటి ద్వారా వచ్చే లాభాన్ని ఖైదీలకే అందజేస్తామన్నారు. దుబ్బాకలో పలు దుకాణాల్లో ఖైదీలు తయారు చేసిన వస్తువులను అమ్మకానికి ఉంచామన్నారు. కార్యక్రమంలో దుబ్బాక పోలీస్ సిబ్బంది కిషన్, కరుణాకర్, జైలర్ సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...