భక్తిశ్రద్ధలతో హనుమాన్ యజ్ఞం


Sat,May 25, 2019 11:43 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : పట్టణంలోని మార్కండేయ స్వామి వారి ఆలయంలో శనివారం హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ యజ్ఞాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో కొనసాగిన యజ్ఞంలో స్వాములు పాల్గొని తమ భక్తిభావం చాటుకున్నారు. హనుమాన్ భక్తులు చేసిన జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో పట్టణం మార్మోగింది. హనుమాన్ యజ్ఞం సందర్భంగా పట్టణంలోని పలు కాలనీలకు చెందిన హనుమాన్ భక్తులు, మాలధారణ స్వాములు తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. యజ్ఞం ముగిసిన అనంతరం మాలధారణ స్వాములు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

దొమ్మాటలో హనుమాన్ గ్రామ సంకీర్తన
మండలంలోని దొమ్మాట గ్రామంలో శనివారం హనుమాన్ మాలధారణ స్వాములు భక్తిశ్రద్ధలతో గ్రామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నిత్యం హనుమాన్ భక్త బృందం చేస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలతో గ్రా మం మార్మోగింది. 29న హను మాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మాల విరమణ కోసం మాలధారణ భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...