పోలీసులు ప్రజలతో మమేకం కావాలి


Sat,May 25, 2019 11:42 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: ఇటీవల జరిగిన వివిధ రకాల ఎన్నికల విధుల నిర్వహణలో హుస్నాబాద్ సర్కిల్ పోలీసుల పాత్ర కీలకమని ఏసీపీ మహేందర్ అన్నా రు. శనివారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించారన్నారు. ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే, గ్రామాల్లో ప్రజలతో మమేకమైన గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు నేరాల సంఖ్యను కూడా తగ్గించాలన్నారు. నేరం చేసిన వారిని జైలుకు పంపేలా కోర్టు డ్యూటీ అధికారులు బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని, అప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. 100కు వచ్చే ఫోన్‌కాల్స్‌కు వెంటనే స్పందించడం, స్టేషన్‌కు వచ్చే దరఖాస్తులను విధిగా పరిశీలించి పరిష్కరించడం చేయాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు దాస సుధాకర్, సతీశ్, పాపయ్యనాయక్, సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...