నాగారంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఎన్నిక


Sat,May 25, 2019 11:42 PM

హుస్నాబాద్‌రూరల్: మండలంలోని నాగారం గ్రామంలో శనివారం గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి వెల్దండి రాజు మాట్లాడుతూ నాగారం గ్రామాన్ని బాలల స్నేహ పూర్వక గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామంలోని పిల్లలందరూ బడికి వెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్టపరంగా సీఏఆర్‌ఏ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ బత్తుల సునీత, కన్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్ రాజమణితో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంపత్, ఐసీడీఎస్ సీడీపీవో జయమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎన్‌ఎం పద్మ, వార్డుసభ్యులు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...