ఘనంగా హనుమాన్ యజ్ఞం


Sat,May 25, 2019 11:41 PM

దుబ్బాక టౌన్: పట్టణంలో హనుమాన్ భక్తులు శనివారం స్థానిక వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ యజ్ఞంను ఘనంగా నిర్వహించారు. యజ్ఞంలో భాగంగా ఉదయం 3 గంటల నుంచి 108 హనుమాన్ చాలీసా పారాయణంను పఠించిన భక్తులు హనుమత్ యజ్ఞంను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా హనుమత్ సమేత సీతారాముల పల్లకీ ఊరేగింపును నిర్వహించారు. దీంతో పట్టణమంతా హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఇట్టి పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వేలేటి జయరామశర్మతో పాటు హనుమాన్ భక్తులు ఎమ్మెల్యే రామలింగారెడ్డిని సన్మానించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్, నాయకులు బండి రాజు, పడాల నరేశ్ తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...