కన్నతల్లి కర్కశత్వం


Sat,May 25, 2019 11:41 PM

-అమ్మతనానికి మాయని మచ్చ
-కన్న బిడ్డల్నే చంపిన తల్లి
-సిద్దిపేటలో కలకలం
-పిల్లలను చంపి నేరుగా కరీంనగర్ ఠాణాలో లొంగుబాటు
సిద్దిపేట టౌన్ : బిడ్డల ఆలన పాలన చూసి మురిసిపోయేది తల్లీ.. గోరుముద్దలు తినిపిస్తూ ఏడిస్తే లాలిస్తూ తన రక్తాన్ని ధారపోసి పిల్లలను పెంచి పోషించే తల్లికి సృష్టిలో గొప్ప పేరుంది. బిడ్డలు ప్రయోజకులైతే తల్లి సంతోషానికి అవధులుండవ్.. చిన్నదెబ్బ తగిలితేనే విలవిల్లాడేది తల్లి మనస్తత్వం. అలాంటిది ఓ తల్లి, కర్కశంగా మారి కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలను తన చేతులతోనే పొడిచి చంపిన హృదయ విధారకరమైన ఘటన సిద్దిపేటలో సంచనలంగా మా రింది. కుటుంబ కలహాలు.. మరే ఇతర కారణాలే కా వొచ్చు కానీ.. చిన్నారులను చంపడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు.
కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2007లో భాస్కర్‌కు మొదటి వివా హం జరిగింది. ఆమెకు విడాకులు ఇవ్వకుండా ఆరున్నర ఏండ్ల క్రితం జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన సరోజనను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. నాలుగు ఏండ్లుగా సిద్దిపేట గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి అయాన్ (5), హర్షవర్ధ్దన్ రెండున్నర సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయాన్‌ను గత సంవత్సరం నుంచి చదివిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మొదటి భార్య తనకు న్యాయం చేయాలని న్యా యస్థానాన్ని ఆశ్రయించడంతో భాస్కర్‌కు ఇటీవలే ఆరు నెలల జైలుశిక్ష విధించింది. కాగా, అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.

ఆరు రోజుల క్రితం ఘర్షణ కారణంగా డయల్ యువర్ 100కు సరోజన ఫోన్ చేసింది. పోలీసులు ఇరువురిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తరువాత సరోజన.. ఓ చానల్‌లో వచ్చే కార్యక్రమాన్ని ఆశ్రయించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. కాగా, భాస్కర్.. శనివారం పనిలో భాగంగా బయటకు వెళ్లాడు. సుమారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిన్నారుల నోట్లో గుడ్డలు కుక్కి.. బీరు సీసాలతో తల్లి సరోజన పొడిచి హత్య చేసింది. నేరుగా కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ విషయాన్ని కరీంనగర్ పోలీసులు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషాద ఉదంతం వెలుగుచూసింది.

-పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్
ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యలు జరుగడానికి కారణాలపై ఆరా తీశారు. డాగ్ స్కాడ్‌తో ఆధారాలు సేకరించారు. అలాగే, కాలనీవాసులను విచారించారు. మృతదేహాల వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనకు తన భర్తకు కొన్నిరోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయని, తాను బతుకనని..పిల్లలను చంపి తాను చస్తానని సరోజన రాసింది. కాగా, పిల్లలను చంపి సరోజన పారిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. పూర్తిస్థాయిలో దర్యా ప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

-కన్నీరుమున్నీరైన కాలనీ వాసులు
చిన్నారుల మృతదేహాలను చూసి కాలనీవాసులు కంటతడిపెట్టుకున్నారు. చిన్నగాయం తగిలితేనే విలవిల్లాడే మనం..అలాంటిది చిన్నారుల కడుపులో కత్తుల్లా సీస ముక్కలు దించిన తల్లి కఠినత్వం పై తల్లులు ఆగ్రహం పెల్లుబికింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు భారీగా భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి భాస్కర్‌కు విషయం తెలియడంతో తన బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నానని, కనికరం లేని తన భార్య బిడ్డలను పొట్టనపెట్టుకోవడాన్ని భాస్కర్ జీర్ణించుకోలేదు. బర్త్ సర్టిఫికెట్ తెచ్చానని.. తిరిగి రా బిడ్డా.. అంటూ భాస్కర్ రోదిస్తూ ఏడ్వడం అందరినీ కలిచి వేసింది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...