జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు మూడంచెల భద్రత


Sat,May 25, 2019 12:30 AM

సిద్దిపేట టౌన్: జిల్లాలో మూడు డివిజన్ల పరిధిలో త్వరలో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తు న్నామని సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. ఈ సం దర్భంగా శుక్రవారం సీపీ మాట్లాడుతూ ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 30మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 390మంది, ఆర్మ్‌డ్ రిజర్డ్ పోలీసులు 30మంది మొత్తం 503 మంది అధికారులు, సిబ్బందితో కౌంటింగ్ సెం టర్ల వద్ద మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారా యణరావుపేట, నంగునూరు, చిన్నకోడూ రు, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్, రాయ పోల్ మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీ సీల ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని తెలి పారు. గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్ మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌం టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో హుస్నాబాద్, కోహెడ, మద్దూరు, అక్కన్నపేట, కొమురవెల్లి, చేర్యాల, బెజ్జంకి మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ చేయబడుతుందన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...