పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు


Sat,May 25, 2019 12:30 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఎండలు తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను జూన్ 12 తేదీ వరకు పొడిగిస్తూ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, జూన్ 12న ప్రారం భం కానున్నాయి. ఎండలు తీవ్రతతో పాటు వడగాలులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని పాఠశాలల్లో జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సమ్మర్ కోచింగ్ పేరిట పాఠశాలలు తెరిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల యజమానులు, ఉపాధ్యాయులు గమనించాలని సూచించింది.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...