బీభత్సం సృష్టించిన గాలివాన


Wed,May 22, 2019 11:33 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : డివిజన్‌లోని గజ్వేల్, వర్గల్, మర్కూక్, ములుగు తదితర మండలాల్లో బుధవారం ఈదురుగాలు లతో కూడిన వర్షాం కురిసింది. అక్కడక్కడ చెట్లు విరిగి పడటంతో పాటు రేకుల ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో పలువురు నష్టానికి గురయ్యారు. వర్షం కురియడంతో వాతావరణం కాస్తా చల్ల బడింది. అలాగే, దుక్కులు దున్నడానికి రైతులు సిద్ధమవుతున్నారు.

జగదేవ్‌పూర్ : ఈదురుగాలులతో కురిసిన వర్షంతో ఇండ్ల పై కప్పు లు ఎగిరిపోయిన సంఘటన మునిగడప గ్రామంలో చోటు చేసుకుంది. అలాగే, విద్యుత్ తీగలు తెగిపడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షంతో వాతవారణం చల్ల బడింది.

వర్గల్ : మండలంలోని శాకారం గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు పంగ పెంటమ్మ రేకుల ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో పెంటమ్మ తృటిలో తప్పించుకుంది. సర్పంచ్ శ్యామలప్రభాకర్, ఉపసర్పంచ్ రంగ భాస్కర్‌గౌడ్, వార్డు సభ్యులు పెంట మ్మ ఇంటిని పరిశీలించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే, మీనాజిపేటలో ఎస్సీ, బీసీ కాలనీల్లోని ఇండ్లు దెబ్బతిన్నాయి. మంకని ఎల్లం, మం కని రామమ్మ ఇండ్లు ధ్వంసమయ్యాయి. స్థానిక శ్రీరామ స్పి న్నింగ్‌లో కూడా రేకుల షెడ్లు, చె ట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తమకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

ములుగు : మండలంలోని పలుగ్రామాల్లో ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోగా, చెట్లకొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత బలమైన ఈదురు గాలుతో కూడిన వర్షానికి కొక్కొండలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలు దెబ్బతిన్నాయి. బస్వాపూర్ గ్రామానికి చెందిన చెలిమెల భిక్షపతి రేకుల ఇలు పూర్తిగా ధ్వంసమైంది. కాగా, బుధవారం సా యంత్రం కూడా పలు గ్రామాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది.

చేర్యాలలో విరిగిన చెట్ల కొమ్మలు
చేర్యాల, నమస్తే తెలంగాణ : మండలంలోని గుర్జకుంట వాగు, వేచరేణి, చేర్యాల పట్టణం, కొమురవెల్లి మండలంలోని లెనిన్‌నగర్ తదితర గ్రామాల్లో గంటపాటు వర్షం కురిసింది. వర్షానికి తోడుగా బలమైన గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పాటు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దొమ్మాట, తాడూరు, చిట్యాల, ఆకునూరు గ్రామాల్లో చిరుజల్లులు కురిసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదే వర్షం అన్ని గ్రామాల్లో ఉంటే రైతులు వ్యవసాయ పనులు చేసుకునే వారని పలువురు చర్చించుకున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...