పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యం


Wed,May 22, 2019 11:33 PM

దుబ్బాక టౌన్: మూరుమూల ప్రాంతంలోని పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. విద్యా రంగంలో దుబ్బాక ప్రాంతం ప్రతీయేడు ఖ్యాతి గాంచడం సంతోషకరమని ఆయన అన్నారు. బుధవారం దుబ్బాకలోని గాయత్రీ వివేకానంద విద్యాలయంలో పదవ తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులు ఆకుల మహాశ్రీ, బి. పర్శరాం, బచ్చు శ్రీవర్ష, సాయిప్రీతిలను ఎమ్మెల్యే సోలిపేట సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రంలో దుబ్బాక ప్రాంతం గొప్ప స్థాయికి చేరుకుందన్నారు. ఈ యేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో దుబ్బాక మండలంలో 7 గురు విద్యార్థులు 10 జీపీఏ సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉంటుందని విద్యా రంగంలో నేడు పోటీతత్వం బాగా పెరిగిందని ముఖ్యంగా బాలుర కంటే బాలికలే సత్తా చాటుతున్నారన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ దుబ్బాకలోనే చదివి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని అది మనకెంతో గర్వ కారణమన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 10 కోట్లతో దుబ్బాకలో పాఠశాల భవనంను నిర్మిస్తున్నామని త్వరలోనే ఆ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాంభోత్సవం జరుగుతుందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన గాయత్రీ వివేకానంద విద్యాలయం యాజమాన్యంను, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటూ 10 జీపీఏ సాధించిన విద్యార్థి పర్శరాంను ప్రత్యేకంగా అభినందించారు. అతని చదువుకు తవ వంతుగా సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంగం మధుసూధన్‌రెడ్డి, బిల్ల గోపాల్, వైట్ల అశోక్, ప్రధానోపాధ్యాయుడు బోడ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...