విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌


Mon,May 20, 2019 11:20 PM

సిద్దిపేట టౌన్‌: విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ అని 4వ వార్డు కౌన్సిలర్‌ దీప్తినాగరాజు అన్నారు. సిద్దిపేట గురుకృప కళాశాలలో నెల రోజులపాటు అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో గణితం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, చిత్రలేఖనం, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ చేతి రాత, పద్యాలు, శ్లోకాలు, యోగా ధ్యానం వంటి కార్యక్రమాలపై ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని కౌన్సిలర్‌ దీప్తినాగరాజు ప్రప్రథమంగా చేపట్టారు. శిక్షణ ముగింపు కార్యక్రమం స్థానిక పాత ఎంసీహెచ్‌ దావాఖాన ఆవరణలో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు రాజేందర్‌, మహేశ్‌, న్యాయవాది రోహిణి ఉపాధ్యాయులు రవీందర్‌, భిక్షపతి, వ్యాపారవేత్త పురుషోత్తం, గౌసోద్దీన్‌, విజయ్‌, సర్వర్‌, శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌన్సిలర్‌ దీప్తి వార్డును అభివృద్ధి పర్చడంతో పాటు చిన్నారులు, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సృజనాత్మకత పెద్దపీట వేసి ఇలాంటి కార్యక్రమానికి శ్రీకా రం చుట్టడం గొప్ప విషయమన్నారు. సిద్దిపేట ప్రగతి పైన శిక్షణలో భాగంగా అభివృద్ధి టూర్‌ను నిర్వహించి మందపల్లి రిసోర్స్‌ పార్కు, తడిపొడి చెత్త సేకరణ, వర్మీకంపోస్టు తయారీ విధానం, గాడిచర్లపల్లిలోని ఐటీసీ ప్లాస్టిక్‌ చెత్తను వేరు చేసేవిధానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన 12మంది విద్యార్థులకు సిల్వర్‌ మెడల్స్‌, ప్రతిభ పురస్కారాలను అందజేశారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వార్డు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...