గంగా, జమున తెహజీబ్‌లా సీఎం కేసీఆర్‌ పాలన


Mon,May 20, 2019 11:19 PM

మద్దూరు : రాష్ట్రంలో గంగా, జమున తెహజీబ్‌లా కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏ ఆర్‌ గార్డెన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఖాజా ఆరీఫ్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు శాసనమండలి విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు, భువనగిరి పా ర్లమెంట్‌ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ ఫా రూక్‌హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంలతో కలిసి రాష్ట్ర మహమూద్‌అలీ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా ప్రజారంజక పాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మతసామరస్యం వెల్లువెరుస్తుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రధానంగా ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పాలన దక్షతకు ప్రజలు పట్టం కట్టార ని, ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. అంతకుముందు స్థానిక ముస్లిం సోదరులతో కలిసి హోంశాఖ మంత్రి మహమూద్‌అ లీ సామూహిక ప్రార్థనలను చేశారు. అదేవిధంగా ఉపవాసం ముగించిన తర్వాత మంత్రికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఖర్జూరాలను తినిపించారు. అనంతరం మహమూద్‌అలీతో పాటు ప్రజాప్రతినిధులను ఖాజా ఆరీఫ్‌ శాలువాలతో సత్కరించారు. కాగా, ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో సీఐ రఘు, ఎస్‌ఐలు రాజిరెడ్డి, సతీశ్‌కుమార్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. కార్యక్రమంలో కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ బద్దిపడిగె కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ మేక సంతోశ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ పేరం భిక్షపతి, జడ్పీటీసీ అభ్యర్థి నాగిళ్ల తిరుపతిరెడ్డి, ఓయూ జేఏసీ నాయకుడు జంగిటి కమలాకర్‌, స్థానిక సర్పంచ్‌ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, నాయకులు కృష్ణాజీరావు, బండి చంద్రయ్య, తాజ్‌మహ్మద్‌, ఆసీఫ్‌, జమల్‌షరీఫ్‌, శౌకత్‌అలీ, షరీపుల్‌హసన్‌, నర్సింహులు, మల్లేశం, ముంతాజ్‌హుస్సేన్‌, సిద్ధిఖీ, క్షీరసాగర్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...