అధిక ధరలకు అమ్మితే చర్యలు


Mon,May 20, 2019 11:19 PM

మిరుదొడ్డి: వాన కాలం సీజన్‌లో నకిలీ విత్తనాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన ధర కంటే విత్తనాలను ఒక్క రూపాయి ఎక్కువ అమ్మిన ఫర్టిలైజర్‌ దుకాణపు దారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మిరుదొడ్డి ఏవో బోనాల మల్లేశం హెచ్చరించారు. సోమవారం మిరుదొడ్డిలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంతో పాటు ఆయా ఫర్టిలైజర్స్‌ దుకాణాల పై వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రయ విక్రయ రిజిష్టర్లను అధికారులు తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ.. ఎరువుల విక్రయ దుకాణపు దారులు విత్తనాలను, ఎరువులను అమ్మిన వెంటనే రసీదులను రైతులకు తమ బాధ్యతగా అందజేయాలని సూచించారు. వాన కాలం సీజన్‌లో రైతులకు సరిపడ విత్తనాలను, ఎరువులను ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో ఉంచామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవో లోహిత్‌, పోలీస్‌ సిబ్బంది సత్యనారాయణ, నాగిరెడ్డి పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...