ఫర్టిలైజర్‌ షాపుల్లో తనిఖీలు


Mon,May 20, 2019 11:19 PM

దుబ్బాక టౌన్‌: దుబ్బాకలోని అన్ని ఫెర్టిలైజర్‌ షాపుల్లో సోమవారం వ్యవసాయాధికారులు, పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుబ్బాక సీఐ హరికృష్ణ, ఎసై సుభాశ్‌గౌడ్‌, వ్యవసాయాధికారి ప్రవీణ్‌ ఫర్టిలైజర్‌ షాపుల్లోని ఎరువులు, విత్తనాలు, క్రిమీసంహారణ మందుల వివరాలను దుకాణ యజమానుల నుంచి అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిషేధించిన బీటీ - 3 పత్తి విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. షాపుల్లో రిజిష్ట్టర్‌లు, రైతులకు అమ్మిన విత్తనాల, ఎరువుల బిల్లులను తనిఖీ చేసి స్టాక్‌ను పరిశీలించారు. అదే విధంగా విత్తనాల ప్యాకెట్లపై తయారీ తేదీ, బ్యాచ్‌ నెంబర్‌, లైసెన్స్‌ నెంబర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో ప్రవీణ్‌, సీఐ హరికృష్ణలు మాట్లాడుతూ... బీటీ - 3 పత్తి విత్తనాల నిరోధానికి గట్టి నిఘాను పెట్టామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎవరైనా నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ అమ్మితే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. దుకాణదారులు కాని, గ్రామాల్లో దళారులు కాని అమ్మితే కఠిన చట్టాలను అమలు చేస్తామన్నారు. రైతులు సైతం దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేసి తప్పక రసీదు పొందాలన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...