రైతుల ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యం


Mon,May 20, 2019 03:43 AM

-తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్
-నాడు ఉద్యమంలో.. నేడు అభివృద్ధిలోఎన్నారైల పాత్ర కీలకం
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
-అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ట్యాంపాసిటీలో హరీశ్‌రావుకు ఆత్మీయ సమ్మేళనం
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : రైతు కళ్లలో సంతోషాన్ని, వారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం కేసీఆర్ విజన్... త్వరలోనే ఆ రోజులు రానున్నాయి... ఆ దిశగా సీఎం కేసీఆర్ పాలన సాగుతుంది. నేడు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారైల ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ట్యాంపాసిటీలో టీఆర్‌ఎస్ అమెరికా సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం మహిళలు బొట్టు పెట్టి మంగళహారతులతో ఘన స్వాగతం పలికి, ఎమ్మెల్యే హరీశ్‌రావును సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. అమెరికాలో ఎన్నారైలు ఇచ్చిన ఆతిథ్యం, ఆత్మీయత చూస్తే నేను హైదరాబాద్‌లోనే ఉ న్నట్లు అనిపిస్తుందన్నారు. 2010 లో ఉద్యమం జరిగిన సమయం లో అమెరికాకు వచ్చిన సందర్భం గా 10 రోజుల్లో 14 రాష్ర్టాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ట్యాంపా పట్టణంలో మాత్రమే అందరినీ కలిశానన్నారు. రైతుల కష్టాలు, వారి ఇబ్బందులపై పిల్లలు చేసిన డాక్యుమెంటరీ చూస్తే 2010లో తెలంగాణ రాష్ట్రం వస్తుందా అనుకున్నాం.. రాష్ట్రం వచ్చింది. వచ్చే రెండేండ్లలో రైతుల కష్టాలు తీరి, వారి కళ్లలో సంతోషాన్ని ఖచ్చితంగా చూస్తామన్నారు. ఒకప్పుడు అభివృద్ధి అంటే బెం గాల్, కేరళ అనుకునే వారు అని.. కానీ, తెలంగాణ దేశానికే రోల్‌మోడల్ అని దేశం మొత్తం వినిపిస్తుందని హరీశ్‌రావు అన్నారు.

రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ, పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం కేసీఆర్ రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, ఒకప్పుడు మహారాష్ట్రంలోని విదర్భ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ ఆత్మహత్యలు ఉండేవని, అలాంటి స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రం నేడు రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ముందుకు సాగుతుందన్నారు.

మొక్క పెరిగి ఫలం అవడానికి కొంత సమయం పడుతుందని, అదే విధంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆకుపచ్చ తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో, నేడు తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్ పార్టీకి మేలు చేయడంలో ఎన్నారైల సహకారం మరువలేనిదన్నారు. ఏ ప్రాంతమైన మన ప్రాచు ర్యం మరువలె.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఎన్నారైలు మరువలేదన్నారు. అమెరికాలో ఉన్న మన పద్ధతు లు, అలవాట్లు మీ పిల్లలకు అలవాటు చేయడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అభినందించారు.

* ఐటీ ప్రొఫెషనల్‌గా వ్యవసాయం
అమెరికా వెళ్లి ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలు చేసే రోజులు చూశాం.. అదే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు కూడా నేడు వ్యవసా యం, సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఒకప్పుడు రైతు అంటే చిన్నచూపు ఉండేదని, కానీ, నేడు రైతు అంటే గౌరవం పెరిగిందన్నారు. ఐటీని లక్ష్యంగా పెట్టుకునేవారు.. వ్యవసాయాన్ని ప్రొఫెషనల్‌గా చేసుకునే రోజులు వచ్చే 4 ఏండ్లలో రాబోతున్నట్లు పేర్కొన్నారు.

* 3 గంటల పాటు చిరునవ్వుతో..
ట్యాంపాసిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు.. సుమారు 3 గంటల పాటు తొలి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో ఆప్యాయం గా పలుకరించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు నవ్వుతూ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ అలానే వారితో కలిసి ఉండడం ఆశ్చర్యం కలిగించిందని అమెరికాలోని ఎన్నారైలు, సిద్దిపేట వాసులు అభిప్రాయపడ్డారు. నాయకుడంటే హరీశ్‌రావులాగా ఓపికతో ఆత్మీయతకు మారుపేరుగా ఉంటాడని, ఇన్నాళ్లు టీవీ లు, పేపర్లో చూశాం కానీ, ఈ రోజు ప్రత్యక్షంగా చూశామని టీఆర్‌ఎస్ నాయకుడు పాల సాయిరాం మిత్రుడు బల్ల రాజేందర్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి మిత్రుడు విఠల శ్రీకాంత్‌శర్మ, ధర్మవరం బ్రహ్మం మిత్రులు సుధాకర్, కిషోర్‌లు ఆనందం వ్యక్తం చేశారు.

ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్‌ఎస్ అమెరికా విభాగం కన్వీనర్లు భైరి పూర్ణ, చందు తాళ్ల, శ్రీనివాస్ గనగోని, వెంగల్ జలగం, కార్యదర్శులు నర్సింహా నాగులవంచ, అరవింద్ తక్కల్లపల్లి, టోని జన్ను, రిషికేశ్ ధర్మారెడ్డి, కాచం జ్ఞానేశ్వర్, మోహిద్ కర్పూరం, ఫ్లోరిడా తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి కానుగంటి, ఫ్లోరిడా తెలంగాణ సంఘం అధ్యక్షుడు నరేందర్ కొమ్మ, కార్యదర్శి వెంకట్ కంచర్ల, శ్రీకాంత్ జలగం, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, మాధవి శేఖరం, వెంకటరావు ఎమ్మడితోపాటు పలువురు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...