‘పది’లో ‘వంద’ ఉత్తీర్ణత


Sun,May 19, 2019 01:35 AM

మద్దూరు : వెనుకబడిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల విద్యబోదనను అందించాలనే సదుద్దేశంతో 2013లో అప్ప టి ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఆదర్శ పాఠశాల లో 6 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బాలికల కోసం వసతి గృహాన్ని నిర్మిం చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాల లో విద్యార్థులకు ఉత్తమ బోదనను అందించి ఉత్తమ ఫలితాలను రాబట్టేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. 2018-19వ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించారు.


ఈ యేడాది పాఠశాలకు చెందిన 100మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలను రాయగా 100మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఎ.రమ్య, బి.రాధిక, జె.సంజయ్‌కుమార్‌, వి.మహేందర్‌రెడ్డి అనే నలుగురు విద్యార్థులు 10 జీపీఏను సాధించారు. 72 మంది విద్యార్థులు 9 జీపీఏకు పైగా, 20 మంది విద్యార్థులు 8 జీపీఏకు పైగా సాధించి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. గతేడాది పాఠశాల 99 శాతం ఉత్తీర్ణతను సాధించగా ఈ ఏడాది 100శాతం ఉత్తీర్ణతను సాధించడం జరిగింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సైతం ఆదర్శ పాఠశాల ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణతను సాధించి మద్దూరు ఆదర్శ ఆదర్శంగా నిలిచింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో 84 శాతం, ద్వితీయ సంవత్సరంలో 82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణతను పొందారు. ఆద ర్శ పాఠశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...