ఉద్యానవన శాఖ అధికారిపై ఎంపీపీ ఆగ్రహం


Sun,May 19, 2019 01:31 AM

ఆయా గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మామిడి తోటలు, కూరగాయ పంటల నష్టం అంచనా వివరాలను ఇప్పటి వరకు ఎందుకు సేకరించలేదని ఉద్యానవన శాఖ అధికారి సైదులుపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతు కు ప్రభుత్వ సాయమందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీటీసీ సభ్యులకు చివరి సర్వసభ్య సమావేశం కావడంతో వారి ఐదేండ్ల పాలనలో సాదక బాధకాలను ఒకరినొకరు పంచుకున్నారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఎడ్ల సోంరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పాలెపు నర్సింలుగౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కోల రమేశ్‌గౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సమాచారాన్ని అందజేయాలని కోరారు. వానాకాలం రైతుబంధు పంట పెట్టుబడి సాయం అందాలంటే రైతులందరూ విధిగా తమ సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోగా ఇవ్వాలన్నారు. గ్రామాలకు వచ్చే ఏఈవోలు, లేదా సిద్దిపేటలోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో రైతులు తమ వివరాలను అందజేయాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...