ఎన్సాన్‌పల్లిలో రైపెండింగ్‌ పనులను పూరిగజ్వేల్‌ మార్కెట్‌లో ధాన్యం రాశ�


Sun,May 19, 2019 01:27 AM

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. దళారీ వ్యవస్థను అంత మొందించి రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించాలనే సీఎం కేసీఆర్‌ లక్ష్యం నేరవేరుతున్నది. కల్లాల నుండి దళారీల పాలయ్యే ధాన్యం రాశులు ఇప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలివెళ్తున్నాయి. ఆలస్యంగా డబ్బులు వస్తాయి... ధాన్యం పై పలు రకాల నిబంధనలు ఉంటాయి.. అన్న అనుమానాలు, దళారీల ప్రచారాన్ని పక్కకుపెట్టి ప్రతి రైతు తను పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధరను పొందుతున్నారు. గజ్వేల్‌ మార్కెట్‌లో ఏడాది పొడవునా కందులు, శనగలు, మొక్కజొన్నలు, పత్తి, వరి ధాన్యం కొనుగోలుతో సందడిగా ఉంటుంది.

గతవారం రోజులుగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగా వివిధ మండలాలకు చెందిన రైతులందరూ ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. గతంలో లాగా గ్రామాల్లో కూడా దళారుల సందడి లేదు. ప్రైవేటు షావుకారుల అప్పులు కూడా బాగా తగ్గడంతో రైతులు పండించిన పంట పై పూర్తిగా తనకే ప్రతి ఫలం అందుతుందని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...