మిషన్‌తో కష్టాలు తీరెన్


Fri,May 17, 2019 11:52 PM

-దుబ్బాక నియోజకవర్గంలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు
-213 గ్రామాలకు నిత్యం 8 ఎంజీడీ గ్యాలన్ల నీటి సరఫరా
-మిషన్ భగీరథ సమస్యలు 24 గంటల్లో పరిష్కారం
-టోల్‌ఫ్రీ నెంబర్‌తో నీటి సమస్యలకు చెక్
-ప్రత్యేకంగా మండలానికో నిర్వహణ బృందం
-ఏడు ట్యాంకులకు ఒక లైన్‌మన్ నియామకం
-ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటినందించే పథకం మిషన్ భగీరథ.. దుబ్బాక నియోజకవర్గంలో మంచినీటి కష్టాలు తీర్చింది. సీఎం కేసీఆర్ మానసపుత్రికైన ఈ పథకం కింద స్వచ్ఛమైన గోదావరి జలాలను వేలాది కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ప్రతి ఇంటికీ సరఫరా చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్‌డబ్ల్యుఎస్) ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. తొలుత గోదావరి జలాలు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ కోమటిబండకు చేరుకుంటాయి. అక్కడినుంచి వంద కిలోమీటర్ల దూరాన ఉన్న దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలకు పైపుల ద్వారా సరఫరా అవుతున్నాయి. గజ్వేల్ కోమటిబండ నుంచి నేరుగా రాయపోలు మండలం వడ్డేపల్లి ఓహెచ్‌బీఆర్‌కు సరఫరా చేస్తున్నారు. అక్కడ్నుంచి ఆరు పైపులైన్ల ద్వారా దౌల్తాబాద్,తొగుట, చేగుంట, నార్సింగి, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు తాగునీరు సరఫరా అవుతోంది. నిత్యం ఒక్కొక్కరికి వందలీటర్ల చొప్పున 8 ఎంజీడీ గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. నీటిని అందించడమే కాకుండా సరఫరాలో అంతరాయం ఏర్పడితే స్పందించేందుకు ప్రత్యేక నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశారు. ఇం దుకు టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి.. మండలానికొక ప్రత్యేక బృందాన్ని నియమించి మిషన్ భగీరథ పైపులైన్లు, ట్యాంకులను పర్యవేక్షిస్తున్నారు. 7 ట్యాంకులకు కలిపి ఒక లైన్‌మన్‌ను నియమించారు. ఎక్కడ పైపులైన్ పగిలినా, లీకేజీ అయినా వెంటనే ప్రత్యేక బృందాలు చేరుకొని సమస్యను పరిష్కరిస్తాయి.

-దుబ్బాక, నమస్తే తెలంగాణ
దుబ్బాక, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయడంతో ప్రజలకు నీటి లేకుండా పోయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నది. ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు.. మరో పక్క సంక్షేమ పథకాలతో ప్రపంచస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తిం పు పొందుతున్నది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం రాష్ట్ర ప్రజలకు వరంగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథ కం ద్వారా గతేడాది నుంచి ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేస్తున్నారు. వందల కి.మీ దూరంలో ఉన్న గోదారి నీళ్లు పేదలకు సరఫరా అవుతుండడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నది.

నియోజకవర్గంలో 213 గ్రామాలకు తాగునీరు
దుబ్బాక నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకంతో ఆరు నెలలుగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, తాగునీరు సరఫరా చేస్తున్నారు. నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, చేగుంట, నార్సింగి మండలాల్లో 213 గ్రామాలకు నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యం తాగునీరు సరఫరా చేపడుతున్నారు. గోదారి జలాలను 110 కి.మీలో ఉన్న గజ్వేల్ కోమటిబండకు మొదట సరఫరా చేస్తున్నారు. అక్కడినుంచి మరో వంద కి.మీ దూరంలో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. గజ్వేల్ కోమటిబండ నుంచి నేరుగా రాయపోల్ మండలం వడ్డేపల్లి ఓహెచ్‌బీర్ (ఓవర్ హెడ్ బ్యాలన్సింగ్ రిజర్వాయర్)కు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి 6 పైపులైన్ల ద్వారా దౌల్తాబాద్, తొగుట, చేగుంట, నార్సింగి, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. నిత్యం ఒక్కొక్కరికి 1వంద లీటర్ల చొప్పున నియోజకవర్గానికి 8 ఎంజీడీ గ్యాలన్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు.

24 గంటల్లో తాగునీటి సమస్య పరిష్కారం
దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు మిషన్ భగీరథ పథకంలో నీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. పైపులైన్, ఇతర సమస్యలు నెలకొంటే.. కేవలం 24 గంటలోనే సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకొని సమస్యను పరిష్కరిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రజల దాహార్తిని తీర్చుతున్నారు. మండలానికోక ఒక టీంను ఏర్పాటు చేసి ఆయా మండలాల్లో మిషన్ భగీరథ పథకం పైపులైన్, ట్యాంక్‌లను పర్యవేక్షిస్తున్నారు. 7ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులకు ఒక లైన్‌మన్ ఏర్పాటు చేశారు. మండలానికొక నిర్వహణ టీంను నియమించారు. ఇందులో ఒక జైంటర్, నలుగురు కార్మికులుంటారు. ఎక్కడ పైపులైన్ పగిలినా, లీకేజీ అయినా ఈ టీం అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...