లక్ష్యం చేరనున్న హరితహారం


Fri,May 17, 2019 11:27 PM

- 34 నర్సరీల్లో ముమ్మరంగా మొక్కల పెంపకం...
- ఉపాధి హామీ, అటవీ శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు
- 11.70 లక్షల మొక్కలు నాటాలన్నదే లక్ష్యం

దుబ్బాక టౌన్ : హరితహారం లక్ష్యం దిశగా మండలంలో మొ క్కల పెంపకం కొనసాగుతుంది. వచ్చే వర్షాకాలంలో మొక్కలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధ్దపడుతున్నారు. మండలంలో ఉపాధి హామీ, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. సుమారు 11.70 లక్షలకు పైగా మొక్కలను ఈ వర్షాకాలంలో హరితహారం కింద నాటేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. గత ఏడాది కంటే ఈయేడు హరితహార కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమ లు చేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రా రంభిస్తారు. మండలంలో 18 గ్రామాల్లో ఈజీఎస్ కింద నర్సరీలను ఏర్పాటు చేశారు.
రామక్కపేట, రాజక్కపేట, పెద్ద చీకోడ్, కమ్మర్‌పల్లి, అచ్చుమాయిపల్లి, గంభీర్‌పూర్, శిలాజీనగర్, వెంకటగిరి తండా, గోసాన్‌పల్లి, బొప్పాపూర్, ఎనగుర్తి, తాళ్ళపల్లి, చిట్టాపూర్, పోతారెడ్డిపేట, అప్పనపల్లి, హసన్‌మీరాపూర్, పద్మనాభునిపల్లి, ఆరెపల్లి గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో మొత్తం 11లక్షల70 వేల పలు రకాల మొక్కల పెంపకం సాగుతుంది. ఈ నర్సరీల్లో ఉసిరి, జామ, కానుగ, సీతాఫలం, దానిమ్మ, వంటి రకాల మొక్కలతో పాటు నీడనిచ్చే చెట్లు, ఇంటి ఆవరణలో పెంపకానికి ఉపయోగించే మొక్కలు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ స్థలాలు, రోడ్లకు ఇరువైపుల నాటేందుకు మొక్కలను పెంచుతున్నారు. టేకు మొక్కలను పొలాల గట్ల వెంబడితోపాటు ఆసక్తి ఉన్న రైతులు తమ పొ లాల్లో సైతం పెంచుకునేందుకు అవకాశముందని అధికారులు అం టున్నారు.

మొక్కల సంరక్షణ ఖర్చులు సైతం ప్రభుత్వం ఇస్తుంది. పొలం గట్టు, పొలాల్లో నాటుకున్న రైతులకే డబ్బులు ఇస్తారు. మొక్కలు కావాలనుకున్న రైతులు ముందుగా దరఖాస్తు చేసుకుంటే కూలీల ద్వారా గుంతలు తవ్వించి మొక్కలను నాటిస్తారు. మొక్కల రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. దుబ్బాక ము న్సిపల్‌తోపాటు మండలంలోని ప్రతి గ్రామానికి 40 వేల మొక్కల చొప్పున సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత గురువారం మల్లాయిపల్లిలో మెప్మా ఆధ్వర్యంలోని కమర్షియల్ నర్సరీని పరిశీలించిన జిల్లా అధికారులు మొక్కల పెంపకం పై సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాలు పడగానే ప్రభుత్వాదేశాలతో నర్సరీల్లోని మొక్కలను అందజేసేందుకు ప్రణాళిక రూపొందిం చారు. ఎండాకాలంలో మొక్కలను కాపాడేందుకు ఉదయం, సా యంత్రం వేళ్లలో నీటిని చల్లుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నా రు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను తెప్పించి నిర్ధేశించిన లక్ష్యా న్ని నెరవేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...