అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే..!


Fri,May 17, 2019 11:26 PM

- ఎక్కడ విన్నా ప్రాదేశిక ఎన్నికలపైనే చర్చ
- గ్రామాల్లో కొనసాగుతున్న విందు రాజకీయాలు
- బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఫలితాలు

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికలు ముగియడం తో ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై పడింది. ఓటర్లు ఇ చ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పదవులు ఎవరి కి దక్కనున్నాయో కానీ, ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతు పలికిన నాయకులు మాత్రం ప్రాదేశిక ఎన్నికల చర్చలు మొ దలు పెడుతున్నారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కావడంతో ప్రతి ఒక్కరూ తాము మద్దతు ఇచ్చిన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని చెబుతున్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, హోటల్ల వద్ద ఎవరి నోట విన్నా ఎంపీటీసీ, జడ్పీటీసీల మా టలే వినవస్తున్నాయి. కొన్ని పార్టీల సభ్యులైతే ఏకంగా సా యంత్రం పూట విందు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థి ఎం త మెజార్టీతో గెలుస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి వచ్చే ఓట్లు ఎన్ని అనే లెక్కలు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కొందరు వ్యక్తులు ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని, గెలిసే ప్రసక్తే లేదని బెట్టింగ్‌లు కడుతున్నారు. ఇక గులాబీ పార్టీ నాయకులు మాత్రం విజయం మాదేననే ధీమాతో ముందుకు సాగుతున్నారు. చేర్యాల మండలంలోని కొన్ని గ్రామాల్లో క్రాస్ ఓ టింగ్ జరిగిందని, కొన్ని పార్టీలకు చెందిన ఓటర్లు తమకు న చ్చిన ఎంపీటీసీలకు ఓట్లు వేసి, జడ్పీటీసీలకు మరో పార్టీకి వే శారని చర్చలు సాగుతున్నాయి. అలాగే మద్దూరు మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి విషయంలో క్రాస్ ఓ టింగ్ చేశారని సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. కాగా చేర్యాల జడ్పీటీసీ బరిలో ఏడుగురు అభ్యర్థులు( శెట్టె మల్లేశం,బీమా లక్ష్మణ్,ఆది శ్రీనివాస్, తోకల ఉమారాణి, కొంగరి వెంకట్‌మావో, తరిగొప్పుల మహేందర్, గజబింకర్ బన్సిలాల్), కొమురవెల్లి జడ్పీటీసీ బరిలో ఐదుగురు(సిలివేరు సిద్ధప్ప, తుక్కోజు కనకయాదగిరి, భాస్కర్ సనాది, మకిలి కనకయ్య,తుక్కోజు గణేశ్‌బాబు), మద్దూరు జడ్పీటీసీ బరిలో ఏడుగురు అభ్యర్థులు( నాగిల్ల తిరుపతిరెడ్డి, ఆలేటి యాదగిరి, గిరి కొండల్‌రెడ్డి, రాజు ఇర్రి,కొత్తపల్లి సతీశ్‌కుమార్, నర్సింహారెడ్డి ఊట్ల, బండి కృష్ణమూర్తి) ఉన్నారు.

ఎంపీటీసీ స్థానాలకు పోటీ..
జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మ ద్దూరు మండలాల్లో మూడు జడ్పీటీసీలు, చేర్యాలలో 11, మ ద్దూరులో 11, కొమురవెల్లిలో 6 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలకు ప్రాదేశిక ఎన్నికల్లో పలు పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. చేర్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గాను 11 ఎంపీటీసీ స్థానాల్లో 28,233 ఓట్లకు గాను 20,795 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

27న తేలనున్న భవితవ్యం
ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 27వ తేదీన తేలనుంది. ఈ నెల 14వ తేదీన ఎన్నికలు ముగిసిన అనంతరం హుస్నాబాద్ డివిజన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం తరలించింది. ఈ నెల 27వ తేదీన ఉదయాన్నే ఓట్ల కౌంటింగ్ ప్రారంభించనున్నారు. మొదటగా ఎంపీటీసీ అభ్యర్థుల కౌంటింగ్ చేసిన అనంతరం జడ్పీటీసీ క్యాండెట్స్ ఓట్లను లెక్కించనున్నారు. కాగా, బ్యాలెట్ పేపర్లు కావడంతో ఎన్నికల ఫలితాలు సైతం ఆలస్యంగా వెలువడనున్నాయి. కాగా, పల్లెలలో తాము గెలుస్తామంటే తామేనంటూ పార్టీ అభ్యర్థుల ఫాలోవర్స్ వేడి పుట్టిస్తున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...