భక్తుల కొంగుబంగారం రేణుకా ఎల్లమ్మ


Fri,May 17, 2019 11:26 PM

-నేటి నుంచి నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
-నిత్యం భక్తులతో పోటెత్తనున్న దేవాలయ జాతర
-జాతరకు ఏర్పాట్లు పూర్తి

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : హుస్నాబాద్‌లోని శ్రీ రే ణుకా ఎల్లమ్మ దేవత భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు ప్రతియేటా జరిగే జా తర ఉత్సవాలు ఏమాత్రం ప్రధాన్యత తగ్గకుండా అంగరం గ వైభంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే జాతరకు హుస్నాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
నెల రోజుల పాటు ఉత్సవాలు..
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి మొదలుకొని జ్యేష్టమాసం పౌర్ణమి వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 18 నుంచి జూన్ నెల 17వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే జాతర నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. 18న ఉదయం ఘ టంతో పాటు సిద్ధోగం కార్యక్రమంతో జాతర ప్రారంభం అవుతుంది. గణపతిపూజల, పుణ్యాహవచనము, దృష్టికుంభము, రేణుకా ఎల్లమ్మ, జమదగ్నిల కల్యాణ మహోత్సవం కార్యక్రమాలను కన్నుల పండువలా నిర్వహిస్తారు. ఇదే రోజు సాయంత్రం బండ్లు తిరిగే కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరుగుతుంది. ప్రతి మం గళ, శుక్ర, ఆదివారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే భక్తులు కుంకుమార్చనలు, ఒడివాల బి య్యం, బోనం, పట్నం వేసి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర ప్రారంభం రోజున అమ్మవారికి పట్టు వ స్ర్తాలు, తలంబ్రాలను స్థానిక మున్సిపాలిటీ నుంచి సమర్పిస్తారు.

జాతర ఉత్సవాలకు ఆలయం ముస్తాబు..
రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయం గోపురంతోపాటు గర్భగుడి, ఇతర గుడులకు కూడా రంగులు వేయడంతో కొత్త కళ సం తరించుకుంది. జాతరలో ఇప్పటికే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం ఆవరణలో ఉన్న 10విశ్రాంతి గదులను కూడా భక్తుల కోసం రంగులు వేయించి సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఎల్లమ్మ దేవాలయంతో పాటు పోశమ్మ దేవాలయం, లోకమాత దేవాలయం, నాగదేవత దేవాలయాలు ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇతర ఆలయాల్లోనూ పూజలు చేస్తారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...