ఆ విత్తుతో విపత్తే..


Fri,May 17, 2019 11:26 PM

- రహస్యంగా విత్తనాల అమ్మకాలు
- దళారులకు అధికారుల సహకారం
- ఫిర్యాదుతో పట్టుబడినా మొక్కుబడి కేసులు
- జోరుగా బీజీ-3 పత్తి విత్తనాల విక్రయాలు
- నష్ట పోతున్న వేలాది మంది రైతులు

గజ్వేల్, నమస్తే తెలంగాణ : పంట సాగు పెట్టుబడి రైతుకు మోయలేని భారంగా మారుతుంది. కూలీల కొరత, కూలీ ధరలు పెరగడంతో కలుపు పనులు అనుకున్న సమయంలో చేపట్టకపోతే పంట పూర్తిగా నష్టపోతుందన్న అందోళన రైతు ను పీడిస్తుంది. ఈ బలహీనతను కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయంగా కలుపు నివారణకు వాడే జన్యుమార్పిడి విత్తనాలు రైతుల్లో ఆసక్తి కల్పిస్తున్నాయి. ఈ విత్తనాలపై నిషేధం ఉన్నా..మూడు, నాలుగేండ్లుగా సంబంధిత విత్తనాల ఉత్పత్తి కంపెనీలు జన్యుమార్పడి విత్తనాల ప్రయోజనాలపై ప్రచారం చేస్త్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో కంపెనీ ప్యాకింగ్ లేకుండా మాములు ప్యాకింగ్‌తో రహస్యంగా అ మ్మకాలను కొనసాగిస్తున్నాయి. దీనిని సాకుగా తీసుకుని దళారీలు మామూలు విత్తనాలను బీజీ-3 విత్తనాలుగా చెలమని చేస్తూ మూడేండ్లుగా రైతులను మోసం చేస్తున్నారు. దీంతో ఏటా కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులకు తీవ్ర పంట నష్టానికి గురిచేస్తున్నారు. పత్తి విత్తనాల అమ్మకం, సాగు చేసిన పంట వివరాలపై అధికారులకు సమాచారం ఉన్నా పట్టించుకొకపోవడం వల్లే బీజీ-3 రకం పత్తి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతూ వస్తుందన్న ఆరోపణలున్నాయి.

సిద్దిపేట జిల్లాలో గత వానాకాలంలో లక్ష 90వేల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. ఇందుకు 5 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయి. మామూలుగా బీజీ-2 విత్తన రకాలు సాగుచేస్తారు. ఇది పచ్చపురుగు నివారణకు జన్యు మార్పిడితో విత్తనం రూపొందించడం జరిగింది. దీనికి అనుమతి ఉండటంతో బహిరంగా అమ్మకాలు జరుగుతున్నాయి. వివిధ కంపెనీల రకాలను బట్టి 450 గ్రాముల ప్యాకేట్ ధర రూ.650 నుంచి రూ.700 వరకు గతంలో విక్రయించారు. పేరున్న రకాలపై అదనంగా వసూలు చేశారు. అయితే బీజీ-3 రకంపై కొన్ని సంవత్సరాలుగా దళారులు ప్రచారం చేస్తున్నారు. కలుపు నివారణకు ఇది ప్రత్యామ్నయం అని ఒకటి రెండుసార్లు ైగ్లెసిల్ గడ్డి మందు వాడకంతో పత్తిలో కలుపు నివారణ చర్యలు సులభం అవుతాయని చెప్పడంతో పలువురు రైతులు బీజీ-3 పత్తి పంట సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా వరుసగా వర్షాలు కురిసినప్పుడు కలు పు మొక్కలు భూమిలో అధిక తేమ వల్ల స్తంబిస్తాయి. ఈ స మయంలో బీజీ-3 విత్తనాల సాగులో అదే తేమపై ైగ్లెసిల్ కలుపు నివారణ మందును పిచికారి చేస్తే కలుపు పూర్తిగా నాశనం కావడంతో సస్యరక్షణ పనులు సులభం అవుతాయని సదరు కంపెనీల దళారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులు బీజీ -3 రకం పత్తి విత్తనాలను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తూ.. సాగు చేసి మోస పోతున్నారు.

రహస్యంగా విత్తనాల విక్రయాలు..
బీజీ-3 రకం పత్తి విత్తనాలను కొన్ని విత్తన దుకాణాల్లో రహస్యంగా విక్రయిస్తున్నారు. వీటిని దుకాణదారులు స్టాకు పెట్టరు. ఇతర రహస్య ప్రాంతాల్లో ఉంచి నమ్మకం ఉన్న రైతులకు మాత్రమే విక్రయిస్తారు. కొత్త రైతుకు కావాలంటే ఇప్పటికే కొనుగోలు చేసిన రైతును వెంటపెట్టుకుని వస్తేనే ఇస్తారు. గ్రామాల్లో కూడా దళారులు ఉన్నారు. ఇండ్లలో స్టాకు పెట్టుకుని తోటి రైతులకు విక్రయిస్తున్నారు. వర్గల్, జగదేవ్‌పూర్, మద్దూర్, బెజ్జెంకి తదితర మండలాల్లో ఈ దందా బాగా సాగుతుంది. గత సంవత్సరం వర్గల్ మండలం అంబర్‌పేట గ్రామ వాసి బీజీ-3 విత్తనాలను భారీ స్థాయిలో విక్రయించినట్లు ప్రచారం జరిగింది. అధికారులు సోదాలు కూడా చేశారు, కానీ సదరు వ్యక్తి పట్టుబడలేదు. దీంతో అతను మ రింతగా విజృంభించి, విక్రయాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వర్గల్ మండలంలో అనేక ఎకరాల్లో బీజీ-3 పత్తి రకాన్ని సాగు చేస్తున్నా.. వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇక్కడి దళారులు ఆంధ్ర, ఇతర ప్రాంతాల నుంచి బీజీ-3 పత్తి విత్తనాలను రహస్యంగా దిగుమతి చేసుకుంటున్నారు. గత సంవత్సరం 20 వేల ఎకరాలకు బీజీ-3 పత్తిపంటను సాగు చేశారని అంచనా. ఇందులో అధిక భాగం బీజీ-3 విత్తనాలు కావని తేలింది. కాగా, కలుపు నివారణ మందును పిచికారి చేస్తే పత్తి మొక్కలు చనిపోవడంతో రైతులు భారీ నష్టాలను మూట కట్టుకున్నారు.

గ్రామాల్లో కనిపించని నిఘా చర్యలు...
బీజీ-3 రకం పత్తి సాగు విస్తీర్ణం ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని, ముందుగానే అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ, కూలీల కొరత, కూలీ రేట్లు బాగా పెరిగాయి. దీనికి తోడు పట్టపడిన వారిపై నామమాత్రం కేసులు కావడంతో వారు తిరిగి ఇదేదందా చేస్తున్నారు. అయితే, గ్రామా ల్లో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిఘా లేకపోవడంతో విత్తన దళారులు తమ దందా బహిరంగంగానే కొనసాగిస్తున్నారు.

గడ్డి విత్తనాలతో అనార్థాలు..
గడ్డి విత్తనాల వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది. జీవకోటికి తీరని నష్టం ఏర్పడుతుంది. ైగ్లెసిల్ పిచికారి చేసిన సమయంలో గాలి బాగా వీస్తే పక్క పొలంలోని పైరుపై పడితే ఆ పైరు కూడా పూర్తిగా నాశనం అవుతుంది. వర్గల్ మండలంలో ఒక రైతు కలుపు మందు పిచికారి చేస్తే.. పక్క పొలం మొక్కజొన్నపై పడి పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.20 వేల నష్ట పరిహారం కూడా సదరు రైతు నుంచి పక్క రైతు వ సూలు చేశారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ైగ్లెసిల్ వాడే పత్తి పంటను సులభంగా గుర్తించవచ్చు. గ్లెసిల్ మందును పిచికారి చేస్తే పక్క పొలం రైతులు గుర్తించి, అధికారులకు సమాచారం ఇవ్వాలి. దీంతో విత్తనాలు ఎక్కడ సేకరించారో సమాచారం సేకరించి దళారీలపై గట్టి చర్యలు తీసుకుంటే విత్తన విక్రయాలను పూర్తిగా అరికట్టవచ్చ.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...