ప్రజల దగ్గరకే ఆయుష్ వైద్య సేవలు


Fri,May 17, 2019 11:24 PM

- ఆయుర్వేద వైద్యురాలు ఉమాదేవి
- చిన్నగుండవెల్లిలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు అవగాహన సదస్సు

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : నేషనల్ ఆయూష్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నారాయణరావుపేట పీహెచ్‌సీ పరిధిలోని చిన్నగుండవెల్లిలో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్ వైద్య విధానం పాత్ర, డయాబెటిస్ నివారణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయుర్వేద వైద్యురాలు ఉమాదేవి ఆయూష్, ఆయుర్వేద వైద్యవిధానాలు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా సంభవించే బీపీ, గుండెజబ్బులు, రక్తనాళాలకు సంబంధించి జబ్బులు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్ గురించి అవగాహన కల్పించారు. వ్యాధుల బారిన పడకుండా ప్రజలు.. ఆయుర్వేద వైద్యవిధానం సూచించిన జీవనశైలిని పాటించాలని సూచించారు. గృహ వైద్యం, పెరటి మొక్కలు, ఔషధ లక్షణాలు, ఉపయోగాలను ఆశ కార్యకర్తలకు వివరించారు. అలాగే, మానసిక వ్యాధులపై అవగాహన కల్పించి యోగా, ప్రాణయామం ప్రాధాన్యత వివరించారు. ప్రజల వద్దకు ఆయూష్ వైద్యవిధానం తీసుకెళ్లి బలోపేతం చేసే కార్యక్రమం లో భాగంగా ప్రజల ఆరోగ్య రక్షణ కోసం శిక్షణా శిబిరాన్ని నిర్వహి స్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణరావుపేట పీహెచ్‌సీ వైద్యుడు డా.మోహన్‌రెడ్డి, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. ఆశ కార్యకర్తలకు ఆయుర్వేద మందుల కిట్లను అందజేసి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...