ప్రాజెక్టు పనులు ఆపే ప్రసక్తే లేదు


Thu,May 16, 2019 11:32 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు అడ్డుకోలేమి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని, ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితులు వేసిన పిటిషన్లపై హైకోర్టులో గురువారం విచారణ జరురగా, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్‌, వెంకట్రామ్‌రెడ్డి, జేసీ పద్మాకర్‌, సిద్దిపేట, గజ్వేల్‌ ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, విజయేందర్‌రెడ్డి హాజరయ్యారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన సింగారం, ఎర్రవల్లి, రాంపూర్‌, లక్ష్మాపూర్‌, బ్రాహ్మణబంజేరుపల్లి, వేములఘాట్‌, పల్లెపహాడ్‌, ఏటిగడ్డకిష్టాపూర్‌లో ఈ నెల 3 నుంచి పన్నెండు రోజుల పాటు(ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ) పునరావాసం, పునరోపాధి కింద నిర్వాసితులకు చెక్కుల పంపిణీని ప్రభుత్వం చేసింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్‌, వెంకట్రామ్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని, గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి చెక్కుల పంపిణీ పక్కాగా, చేపట్టారు. 8 ముంపు గ్రామాల్లో 4108 కుటుంబాలకు గానూ 4061 కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కేవలం 47 కుటుంబాలు ప్యాకేజీని తిరస్కరించాయి. ఈ విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్యాకేజీని ప్రభుత్వం ఇస్తుందన్న విషయాన్ని నివేదికలో పొందుపర్చారు. 18 ఏండ్లు పైబడిన యువతీ యువకులకు 250 గజాల ఇంటి స్థల పట్టాతో పాటు రూ.5 లక్షల ప్యాకేజీని అన్ని గ్రామాల్లో కలిపి 1055 మందికి ఇవ్వడం జరిగిందని నివేదికలో పొందుపర్చారు.

గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు చేతకానీ వారు ఎవరైన ఉంటే వారి ఇంటికి వెళ్లి కూడా చెక్కులను పంపిణీ చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. దీంతో వంద శాతం పరిహారం పంపిణీ పూర్తి చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడు ఎకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేయడంతో పాటు పరిహారం చెల్లింపులో ఏమైనా అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని పిటిషనర్లకు సూచించింది. పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన నిర్వాసితుల పరిహారాన్ని వారి న్యాయవాదులకు అందజేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారాన్ని అందజేసింది.

కొమురవెల్లి మల్లన్నసాగర్‌ 50 టీఎంసీల సామర్థ్యం
కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప నులు జోరుగా కొనసాగుతున్నాయి. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని మల్లన్నసాగర్‌కు తరలిస్తారు. సిద్దిపేట జిల్లాకే కా కుండా ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా, నల్గొండ జిల్లాలకు గుండెకాయలాంటిది మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌. ఇప్పటికే రిజర్వాయర్‌కు సంబంధించిన అప్రో చ్‌ చానల్‌, గ్రావిటి కెనాల్‌, మెయిన్‌ టన్నెల్‌ తదితర పనులు చివరి దశకు వచ్చాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ బండ్‌ పొడవు 22.9 కిలో మీటర్లు. దీని ఎత్తు 60 మీటర్లు ఉంటుంది. బండ్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగడానికి రీచ్డ్‌గా విభజించి, పనులు చేపడుతున్నారు. రిజర్వాయర్‌ పూర్తయ్యే లోపల కాలువల ద్వారా చెరువులు నింపేందుకు ప్రణాళికబద్ధంగా పనులు జరుగుతున్నాయి.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...