అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం సీజ్‌


Thu,May 16, 2019 11:32 PM

రాయపోల్‌: అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని రైస్‌మిల్లులలో నిల్వ చేసిన వాటిపై రాయపోల్‌ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండలంలోని రామారం గ్రామంలో మహాలక్ష్మి రైస్‌మిల్లులో రాత్రి వేళ్లలో డీసీఎం వ్యాన్‌లో రేషన్‌ బియ్యంను తరలించేందుకు ప్రయత్నించగా రాయపోల్‌ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి డీసీఎం వ్యాన్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా గురువారం జిల్లా డీఏస్‌వో వెంకటేశ్వర్లు రామారం రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. విక్రయించడానికి సిద్ధంగా ఉన్న 20 క్వింటాళ్ల బియ్యంను సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌బియ్యం ఉంచడం పట్ల ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం పేదల కోసం ప్రజల కోసం రేషన్‌ బియ్యం అందిస్తున్నదని అయితే కొంత మంది వ్యాపారులు వాటిని కొనుగోలు చేసుకొని అక్రమంగా రైస్‌మిల్లుల ద్వారా బియ్యం పక్కదారి పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానం ఉన్న రైస్‌మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని రైస్‌మిల్లులను సీజ్‌ చేస్తామన్నారు. వ్యాపారులు ఎవరికీ వారు ఇష్టారాజ్యంగా బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సీజ్‌ చేసిన బియ్యన్ని దౌల్తాబాద్‌ గోడౌన్‌కు తరలించారు. ఆయన వెంట రాయపోల్‌ మండల ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ స్వామి, ఏసీఎస్‌ఓ సురేందర్‌రెడ్డి, వీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...