విద్యార్థులకు బాలతేజ అవార్డులు


Thu,May 16, 2019 11:29 PM

చిన్నకోడూరు : విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సరస్వతీ సేవా సమితి గురువారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బాలతేజ అవార్డులను నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అందుకున్నారు. గ్రామానికి చెందిన పల్లె పవన్‌కుమార్‌ సాహిత్య విభాగం, కొబ్బరిచెట్టు అభినవ్‌ చిత్రలేఖనం విభాగం పోటీల్లో పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడంతో వారిని అవార్డులు వరించాయి. సీఎం కేసీఆర్‌ గురువు మృత్యుంజయశర్మ చేతుల మీదుగా బాలతేజ అవార్డులను అందుకున్నారు. ఉపాధ్యాయులు బైతి దుర్గయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మయ్య, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.

పిట్ల కావ్యకు బాలతేజ పురస్కారం
సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట జిల్లాకు చెందిన పిట్ల కావ్య బాలతేజ పురస్కారం వరించింది. సరస్వతీ సేవా సమితి కొత్త గూడెం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కావ్యమాల శతకం రచించినందుకు మామిడి హరికృష్ణ, వేలేటి మృత్యుంజయశర్మ సుమిత్రదేవి చేతుల మీదుగా బాలతేజ పురస్కారం గురువారం అందుకుంది. చిన్న వయస్సుల్లోనే పిట్ల కావ్య శతకం రచించడం పట్ల సముద్రాల శ్రీనివాస్‌ బాలల ప్రోత్సాహకులు అశోక్‌, బాలసాహితీవేత్త ఉండ్రాల రాజేశం, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కోనం పర్శరాములు, బస్వరాజ్‌కుమార్‌, నిర్మల, అనురాధ ఆమెను అభినందించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...