సంగారెడ్డి జిల్లా జైలు సంస్కరణలు భేష్‌


Thu,May 16, 2019 11:26 PM

సంగారెడ్డి రూరల్‌ : జిల్లా జైలులోని సదుపాయాలు, చేపట్టిన సంస్కరణలు చూస్తుంటే ఈ జైలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లూరు, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన జైలు శాఖాధికారులు అన్నారు. గురువారం కంది మండలంలోని జిల్లా జైలులో ‘అకాడమీ ఆఫ్‌ ప్రిసన్స్‌ అండ్‌ కరక్షనల్‌ సర్వీసెస్‌' వెల్లూరు, తమిళనాడు ప్రాంతాలకు చెందిన 14 మంది అధికారులు సందర్శించారు. ముందుగా జైలులో ఏర్పాటు చేసిన కారాగారాన్ని పరిశీలించి అనంతరం జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్‌, సెలూన్‌లను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జైలు ఆవరణలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న నర్సరీ, మామిడి తోటను, పాత జైలు మ్యూజియంను కుడా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత జైలును మ్యూజియంగా ఏర్పాటు చేసి ఇందులో ఒకరోజు సాధారణ వ్యక్తికి రూ.500లకే జైలు జీవితాన్ని పరిచయం చేయడం కొత్త ఆలోచన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి సదుపాయం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జైళ్ల శాఖ తీసుకొస్తున్న సంస్కరణలు అన్ని రాష్ర్టాలకు వ్యాప్తి చెందేలా ఆదర్శంగా ఉందని వారు కితాబునిచ్చారు. జైలు శాఖ తెస్తున్న సంస్కరణలను అమలు పర్చడంలో సంగారెడ్డి జిల్లా జైలు ముందు వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో జైలు ప్రొఫెసర్‌ మదన్‌రాజ్‌, జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌గౌడ్‌, సబ్‌ జైలు అధికారి వెంకటేశ్వర్లు, జైలర్లు డి.కాళిదాస్‌ గణేశ్‌, డిప్యూటీ జైలర్‌ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...