పేదల కోసం పాటుపడిన వ్యక్తి వెంకటేశ్వర్లు


Wed,May 15, 2019 11:33 PM

హుస్నాబాద్‌టౌన్‌ : పేదవర్గాల అభ్యున్నతికోసం పాటుపడిన నాయకుడు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లని మున్సిపల్‌ చైర్మన్‌ సుద్దాల చంద్రయ్య కొనియాడారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బొమ్మ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సభకు స్ఫూర్తి సంస్థ అధ్యక్షుడు పందిల్ల శంకర్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికోసం నిరంతరం తపన పడిన వ్యక్తి మనమధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు.

వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధిచేయాలనే తపన నిరంతరం ఉండేదని, ఆ యన సేవలు ఈ ప్రాంత ప్రజలు మరిచి పోలేరన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బొలిశెట్టి సుధాకర్‌, మాజీ హౌస్‌ఫెడ్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, మాజీ జేఏసీ రాష్ట్రనాయకుడు కత్తి వెంకటస్వామి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, మాజీ సర్పంచ్‌ కేడం లింగమూర్తి, మార్కెట్‌ కమిటీమాజీ చైర్మన్‌ లింగాల సాయన్న, వివిధ పార్టీల, సంస్థలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు బొమ్మ వెంకటేశ్వర్లు చిత్రపటం వద్ద పలువురు నివాళులు అర్పించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...