కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


Wed,May 15, 2019 11:32 PM

మద్దూరు : గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఐకేపీ ఏపీడీ శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ డీపీఎం కరుణాకర్‌రావు, ఐబీ డీపీఎం విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం మద్దూరు, నర్సాయపల్లి, లింగాపూర్‌, కొండాపూర్‌, బైరాన్‌పల్లి, లింగాపూర్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగో లు కేంద్రాలను ఐకేపీ, మార్కెటింగ్‌ అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రా మైక్య సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. అంతకుముందు కొనుగోళ్లకు సంబంధించిన పుస్తకాలను అధికారులు పరిశీలించారు. అదేవిధంగా ట్యాబ్‌లో కొనుగోళ్ల వివరాల నమోదు తీరును, అందుబాటులో ఉన్న గన్నీబ్యాగుల వివరాలను అధికారులు సేకరించారు. కార్యక్రమంలో ఏపీఎం నర్సయ్య, సీసీలు ప్రేమలత, సిద్ధిమల్లయ్య, మహేందర్‌, పోశమ్మ, గ్రామైక్య సంఘం ప్రతినిధులు, రైతులు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...