కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం


Wed,May 15, 2019 11:31 PM


సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట మండలంలో హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేటలోని సుడా కార్యాలయంలో ఓఎస్డీ బాల్‌రాజుతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వివిధ గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకలతో వివిధ ప్రభుత్వం పథకాల అమలు తీరును సమీక్షించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. జూన్‌ మొదటి వారంకల్లా గ్రామాల అభివృద్ధి కోసం నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని సూచించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...