ప్రభుత్వ పాఠశాలలు


Wed,May 15, 2019 11:31 PM

ఉత్తమ ఫలితాలకు నిలయాలుణంలో ఉత్తమ విద్యనందించడంతోపాటు ప్రయివేట్‌ విద్యాసంస్థల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తూ అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో పరుగులు పెడుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించుకొని ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేసి ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతతో పాటు 10జీపీఏ సాధించి ఆదర్శంగా నిలిచిన ములుగు, మర్కూక్‌ మండలాల జిల్లా పరిషత్‌ ప్రభుత్వోన్నత పాఠశాలలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

ప్రణాళికాబద్ధంగా ముందుకు... 2018-19 విద్యాసంవత్సరం మొదటి నుంచే 10వ తరగతి విద్యార్థులపై ఇటు తల్లితండ్రులు, అటు ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధవహించి ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేశారు. చదువులో చురుగ్గా ఉన్నవారిని, వెనుకబడిన వారిని గ్రూపులుగా విభజించి మొదటి గ్రూప్‌ విద్యార్థులను టాపర్లుగా నిలిపేందుకు, రెండవ గ్రూప్‌ విద్యార్థులను వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వచ్చే విధంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, తల్లిదండ్రులతో సమీక్ష నిర్వహించి వారిలో విద్యాప్రమాణాలను మెరుగుపరిచారు. ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.

అంతేకాకుండా ప్రిపరేషన్‌ సమయంలో వేకప్‌కాల్స్‌తో ఉదయాన్నే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫోన్‌ కాల్స్‌ చేసి నిద్రలేపి వారు ఆ రోజు ఏ అంశంపై చదువాలో సూచించారు. దాంతో పాటు విద్యార్థుల ఇంటికి స్వయంగా ఉపాధ్యాయులే వెళ్ళి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇలా విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించారు.

నూతనోత్సాహాన్ని నింపిన ‘ప్రేరణ’ పబ్లిక్‌ పరీక్షలు అనగానే విద్యార్థులు భయంతో వణికిపోతుంటారు. అలాంటి వారిలో భయాన్ని తొలగించేందుకు ఎంఈవో వెంకటేశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో వీపీజే ఫౌండేషన్‌ చైర్మన్‌ విష్ణుజగతి సహకారంతో ములుగు, మర్కూక్‌ మండలాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ సమక్షంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వీరేందర్‌చే ‘ప్రేరణ’ పేరిట విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు చేసిన నిరంతర కృషి ఫలించి ములుగు మండలంలోని 9 పాఠశాలలకు గాను 6 పాఠశాలల్లో , మర్కూక్‌ మండలంలోని 4 పాఠశాలలకు గాను 4 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతను సాధించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...