ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం


Tue,May 14, 2019 11:32 PM

-పోలింగ్‌ సరళిని తెలుసుకున్న
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, నమస్తే తెలంగాణ : ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన మూడో విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మండలంలోని ముస్త్యాల, కడవేర్గు, ఆకునూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించడంతోపాటు పార్టీ శ్రేణులను పోలింగ్‌ వివరాలు, పార్టీకి వచ్చే ఓట్లు విషయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామ నియోజక వర్గంలో ప్రతిపక్షాలకు తావు లేకుండా మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓట్లు వేసినట్లు వివరించారు. మంచి చేసే టీఆర్‌ఎస్‌ను వారే కాపాడుకుంటారని, రానున్న రోజుల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి శెట్టె మల్లేశం, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు మంగోలు చంటి, ఎంపీటీసీ అభ్యర్థులు మీస పార్వతి, తాటికొండ వేణుగోపాల్‌, తివారి శ్రావణి, అనంతుల మల్లేశం, సర్పంచ్‌ కొమ్ము ల స్వప్న, ఉపసర్పంచ్‌లు మీస రవితేజ, రాజు, నాయకులు తాడెం కృష్ణమూర్తి, కొంగరి గిరిధర్‌, మహేందర్‌, అల్లిబిల్లి రాములు, కె.నర్సింహ్మరెడ్డి, జహీరోద్దీన్‌ పాల్గొన్నారు.

క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం..
కొమురవెల్లి : ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. కొమురవెల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటించి పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలోకి చేరాయన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షే మపథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌.. దేశానికి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొ న్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల రికార్డును తిరగరాసిన టీఆర్‌ఎస్‌, ప్రతి ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 సీట్లతోపాటు ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందన్నారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, మల్లన్న ఆలయ డైరెక్టర్‌ ముత్యం నర్సింలుగౌడ్‌, మాజీ సర్పంచ్‌ పడిగన్నగారి మల్లేశం, జడ్పీటీసీ అభ్యర్థి సిలువేరు సిద్దప్ప, నాయకులు సార్ల కిష్టయ్య, గొల్లపల్లి కిష్టయ్య, బత్తిని నర్సింలుగౌడ్‌, స్వాములపల్లి కనకచారి, పొట్లచెరువు శివ య్య, పోతుగంటి కొంరెల్లి, అన్నబోయిన రవీందర్‌, పొట్లచెరువు తిరుపతి, గొల్లపల్లి నాగరాజు తదితరులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...