నిఘా నీడలో గ్రామాలు..


Mon,May 13, 2019 02:43 AM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : ప్రశాంత వాతావరణంలోనే ప్రజల జీవన మనుగడ సాధ్యమవుతుందని భావించిన పోలీసు అధికారులు గ్రామాగ్రామన సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ప్రజలకు రక్షణ కల్పించటంతో పాటు నేరాలను పూర్తిగా నిర్మూలించేందుకు సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. దీంతో నిఘా నీడలోని గ్రామాలు స్వేచ్ఛపూరిత వాతావరణంలో నెలకొన్నాయి. దుబ్బాక పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లాస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా రు. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ ప్రత్యేక చొరువతో సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లాలోనే దుబ్బాక పోలీస్‌స్టేషన్ ప్రథమ స్థానంలో నిలబెట్టారు. సిద్దిపేట జిల్లాలో 25 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఇందు లో అత్యధికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్ దుబ్బాక పోలీస్‌స్టేషన్ కావటం గమనార్హం.

దుబ్బాక పరిధిలో 286 కెమెరాలు ఏర్పాటు,త్వరలో మరో 54 కెమెరాల బిగింపు..
జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటులో దుబ్బాక పోలీస్‌స్టేషన్ ముందంజలో ఉంది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో నేనుసైతం కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచారు. ప్రధానంగా మహిళా, యువజన సంఘాల సహకారంతో సీసీ కెమెరాలకు వి రాళాలు సేకరించారు. అలాగే, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి, వారు ఇచ్చిన విరా ళాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. జిల్లాలోని 25 పోలీస్‌స్టేషన్లలో దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అ త్యధికంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం అభినందనీయం.
దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో 28 గ్రామాలతో పాటు మరో 4 మదిర గ్రామాలున్నాయి. 28 గ్రామాల్లో 286 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేకులకుంట మల్లికార్జున ఆలయం, పెద్దగుండవెళ్లి రేణుక (ఎల్లమ్మ) దేవాలయం వద్ద భక్తుల సందడి ఉంటున్నందునా ఒక్కో ఆలయం వద్ద 16 కెమెరాల చొప్పున 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో మల్లాయిపల్లి, శిలాజీనగర్, పద్మశాలిగడ్డ గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పని లో ఉన్నారు. త్వరలోనే ఈ గ్రామాల్లో మరో 22 కెమెరాలను ప్రారంభించనున్నారు. దీంతో దుబ్బాక పోలీస్‌స్టేషన్ శతశాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా దక్కించుకోనుంది.

సీసీ కెమెరాల ఏర్పాటుతో సత్ఫాలితాలు...
దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతోపాటు ప్రజలు శాంతియుత వాతావరణం లో జీవిస్తున్నారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పలు కేసులను పోలీసులు సులభంగా ఛేదించారు.
ఇందుకు పలు ఉదాహారణలు..
-గతేడాది రాజక్కపేటలో ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన సంఘటనలో సీసీ ఫుటేజీల ఆధారంగా చోరీకి పాల్పడిన నిందితుడ్ని పక్క జిల్లాలో పట్టుకున్నారు.
-దుంపలపల్లిలో ఆరు నెలల క్రితం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిన సంఘటనలో సీసీ ఫుటేజీ ఆధారంగా ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
-దుబ్బాక పట్టణంలోని తెలంగాణ తల్లి సర్కిల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో పరారైన నిందితుడ్ని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
-రామక్కపేటలో సంవత్సరం క్రితం ఓ స్వర్ణకారుడి ఇంట్లో బంగారం, డబ్బు దోచుకెళ్లిన సంఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా ఆ దొంగను గుర్తించి, పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
-సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆరు నెలలుగా గ్రామాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనం తరం ప్రతి గ్రామంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుతో గ్రామాల్లో నేరాలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడేవారు తమ ఆలోచనను విరమించుకుని సత్ప్రర్తనతో నడుచుకుంటున్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...