సరదా మాటున మృత్యువు..!


Mon,May 13, 2019 02:41 AM

-ఈత సరదా ప్రాణాన్ని హరిస్తుంది..!
ఏటా వేసవిలో ఈత సరదా చిన్నారులకు ప్రాణహానిని కలిగిస్తుంది. అప్పటివరకు ఆడతూ పాడుతూ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన చిన్నారులు, ఒక్కసారిగా నీటిలో పడి మృతి చెందారంటూ సమాచారం రాగానే వారి పరిస్థితి ఆగమ్యగోచరం. నదులు, కాల్వలు, బావులు, వంకల్లో వేసవి తాపాన్ని తీచ్చుకునేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా ఈత రాని చిన్నారులు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయి. నివారణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు సంఘటనలు జరిగిన అనంతరం హడావుడి చర్యలు చేపట్టి మౌనంగా ఉంటుండడంతో జిల్లావ్యాప్తంగా ఏటా 20 నుంచి 30 మందికి పైగా నీట మునిగి మృత్యువాతపడుతున్నారు. అధికారులు తల్లిదండ్రులను అప్రమత్తం చేసి నీటి వనరుల వద్దకు చిన్నారులు వెళ్లకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-ఈతకెళ్లే వారు సహాయకులను కూడా తీసుకెళ్లాలి.
-ఈతరాని చిన్నారులపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
-కొత్తగా ఈత నేర్చుకుంటున్న పిల్లలు నడుముకు సొరకాయ బుర్ర, బెండ్లు, రబ్బర్లు, ట్యూబ్‌లు, తాళ్లు లాంటివి కట్టుకోవాలి.
-బావులు, కొలనుల్లో నీటి లోతును గుర్తించి దిగడం మంచిది.
-రాతికట్టడం ఉన్న బావుల్లో పైనుంచి దూకడం రాళ్ల మీద పడి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
-తలకిందులుగా నీళ్లల్లో దూకరాదు. పక్కనున్న రాళ్లకు, గట్టి నేలకు తలకొట్టుకుంటే ప్రాణాలు పోతాయి.
-చెరువుల్లోకి ఈతకు వెళ్లే ముందు అక్కడ లోతైన గుంతలు, పూడిక, నాచు గురించి తెలుసుకోవాలి.
- ప్రమాదవశాత్తు నీటిలో మునిగిన వారిని ఒడ్డుకు చేర్చి, తాగిన నీటిని కక్కించాలి.
-ఊపిరితిత్తుల్లో శ్వాస, చాతిపై చేతితో రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో నుంచి నీరు బయటకు వచ్చి శ్వాస మెరుగుపడుతుంది.
-ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి వైద్యశాలకు తరలించాలి.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. గతంలో ప్రమాదాలు జరిగిన గ్రామాల్లో చిన్నారులు, తల్లితదండ్రులకు అవగాహన కల్పించి నీటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...