రైల్వే స్టేషన్లలోబాటిల్ క్రషింగ్


Mon,May 13, 2019 02:40 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాడేసిన మినరల్ వాటర్ బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే నడుం బిగించింది. జంటనగరాల్లోని రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా తాగునీటి అవసరాల కోసం సీసాలు కొని తాగిన తర్వాత చెత్త బుట్టల్లో, కోచ్‌లలో, స్టేషన్ ప్రాంగణంలో పడేస్తుండటంతో అవి పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంటనగరాల పరిధిలోని సికింద్రాబాద్, హైదాబాద్, కాచిగూడ, లింగంపల్లితోపాటు అత్యధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మొదటి దశలో 22 మెషిన్లను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులు సమకూర్చడం జరిగిందని తెలిపారు.

మూడు సెకన్లలో..
పర్యావరణ పరిరక్షణకు హాని చేయని విధంగా బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను 3 నుంచి 4 సెకన్లలో ముక్కలు ముక్కలుగా చేస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో 600 బాటిళ్లను, హైదరాబాద్ స్టేషన్‌లో 300 బాటిళ్లను క్రషింగ్ మిషన్లలో ముక్కలు ముక్కలు చేసే సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ముక్కలైన సీసాల భాగాలు యంత్రం అడుగునున్న ట్రే లో పడుతాయి. వీటిని పర్యావరణానికి భంగం కలుగని విధంగా రీసైక్లింగ్ చేసే అధికారిక సంస్థలకు విక్రయిస్తారు. బాటిల్ క్రషింగ్ యంత్రాలు స్టేషన్లతో పాటు సికింద్రాబాద్‌లోని కోచ్ మేయింటనెన్స్ యార్డుల్లో వ్యర్థాల సేకరణ కేంద్రంలోనూ అమర్చడం వల్ల పారిశుధ్య సిబ్బందికి కోచ్‌లను శుభ్రం చేసే పని సులభతరమవుతుంది.

నగర వ్యాప్తంగా 22 యంత్రాలు
నగర వ్యాప్తంగా 22 బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో 12, హైదరాబాద్ 05, నెక్లెస్‌రోడ్డు, బేగంపేట, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, లింగంపల్లి స్టేషన్లలో ఒక్క యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేశ్ తెలిపారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...