రెండో విడుతకు నేటి నుంచి నామిషనేషన్లు


Fri,April 26, 2019 12:01 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: పరిషత్ రెండో విడుత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని 6 మండలాలకు చెం దిన 64 ఎంపీటీసీ,6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా 1,72,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 388 పోలింగ్ కేంద్రాలు సిద్ధమవుతుండగా, మిగతా ఏర్పాట్లలో యం త్రాంగం సన్నద్ధమవుతున్నది. గజ్వేల్ డివిజన్‌లో 6 మండలాల్లో 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను 388 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొండపాక మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా, 75 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35,666 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. గజ్వేల్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల 31,395 మంది ఓటర్లు, 69 పోలింగ్ కేంద్రాల్లో, జగదేవ్‌పూర్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 30,994 మంది ఓటర్లు 73 పోలింగ్ కేంద్రాల్లో, వర్గల్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 28,645 మంది ఓటర్లు 66 పోలింగ్ కేంద్రాల్లో, ములుగు మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 27,560 మంది ఓటర్లు 63 పోలింగ్ కేంద్రాల్లో, మర్కూక్ మండలం 7 ఎంపీటీసీ స్థానాలకు 17,845 మంది ఓటర్లు 42 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

అభ్యర్థుల ఎంపికకు కసరత్తు..
వివిధ పార్టీలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా పార్టీలు కసరత్తు చేపట్టాయి. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ నుంచి ఒక్కో స్థానానికి ఒకరికి మించి పోటీలో ఉండగా, మిగతా వారితో చర్చించి ఒక్క అభ్యర్థి ఎంపికను గజ్వేల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పన్యాల భూపతిరెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావులు చర్యలు చేపట్టారు. త్వరలో అభ్యర్థుల ప్రకటన విడుదల అవుతుందని చెబుతుండగా, పోటీలో ఉన్నవారందరూ సమర్థులేనని మిగతావారికి వివిధ రకాలుగా అవకాశాలు కల్పించడం జరుగుతుందని వివరించారు.

నేటి నుంచి నామినేషన్లు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల రెండో విడుత ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్నది. 28న నామినేషన్లకు తుది గడువు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 29న స్కూట్ని జరుగగా, మే 2న ఉపసంహరణ, ఉపసంహరణ మధ్యాహ్నం 3 గంటలలోపు గడువు కాగా, మే 10న పోలింగ్ ఉంటుంది. కాగా, ఎన్నికల నిక్వహణ కోసం అన్ని గ్రామాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నది. ప్రశాంతంగా పోలింగ్ జరిగేట్లు చర్యలు చేపడుతున్నారు. కాగా, గజ్వేల్ నియోజకవర్గంలో పలు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలకు అభ్యర్థులు దొరుకడంలేదు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...