ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు


Fri,April 26, 2019 12:00 AM

సిద్దిపేట టౌన్ : ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తుందని విద్యార్థులు ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మనోధైర్యం కల్పించారు. నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన అజయ్ ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. దవాఖాన డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి అజయ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కమిటీ వేశారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని సూచించారు. విద్యార్థులకు రీవాల్యూవేషన్ ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, అధైర్యపడవద్దని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఫెయిలైనట్లు కాదని, ప్రాణాలు పోతే తిరిగి రావని ఎవరు కూడా అలాంటి చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాల తో ఓఎస్‌డీ బాల్‌రాజు దవాఖానలో చికిత్స పొందుతున్న అజయ్‌ను పరామర్శించి కుటుంబానికి భరోసా కల్పించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...